- డిప్యూటీ సీఎంకు థ్యాంక్స్ చెప్పిన విద్యుత్ సంఘాలు
హైదరాబాద్, వెలుగు: విద్యుత్ ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పించాలని సీఎండీలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించడంపై ఎలక్ట్రిసిటీ ఎంప్లాయిస్ యూనియన్ నేతలు హర్షం వెలిబుచ్చారు. విద్యుత్ ఉద్యోగుల ఆవేదనను అర్థం చేసుకుని సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం భట్టిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఇన్నాళ్లు విద్యుత్ ఉద్యోగుల ప్రమోషన్ల విషయంలో అన్యాయం జరిగిందని, రేవంత్ సర్కార్ అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రమోషన్ల విషయంలో జెన్ కో, ట్రాన్స్ కో, సదరన్, నార్తర్న్ డిస్కం సీఎండీలు సహకరించారని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.