ఎకో టూరిజం @ పులిగుండాల

ఎకో టూరిజం @   పులిగుండాల
  • వేల ఎకరాల్లో ఉన్న కనకగిరి అడవులను గుర్తించిన ప్రభుత్వం 
  • గిరిజన నిరుద్యోగులకు లబ్ది 

పెనుబల్లి, వెలుగు : ఖమ్మం జిల్లాలోని  కనకగిరి అటవీ ప్రాంతంలో ఉన్న పులిగుండాల ప్రాజెక్ట్​ కు  ప్రభుత్వం నిధులు కేటాయించింది. ప్రాజెక్ట్​ నిర్మాణంతో పాటు కనికగిరి అటవీ ప్రాంతాన్ని ఎకో టూరిజం సర్క్యూట్​ గా డెవలప్​ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం అడవులను అభివృద్ధి చేయాలనీ మొదటి బడ్జెట్ లోనే  1064 కోట్లు కేటాయించింది. కనికగిరి అటవీ ప్రంతాన్ని టూరిస్ట్​ కేంద్రంగా అభివృద్ది చేసేందుకు అన్ని  
అవకావాలున్నాయి. 

 అడుగడుగునా అందాల అడవి


కనకగిరి అడవుల్లో వీకెండ్ లో వందల సంఖ్యలో పర్యాటకులు వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుంటారు. ఈ ప్రాంతం లో గత బీఆర్ఎస్​ ప్రభుత్వం లో అటవీశాఖ అధికారులు, జిల్లా కలెక్టర్​ పర్యటించి వన్య ప్రాణి పార్క్ ఏర్పాటు చేయడంతో పాటు టూరిజం హబ్ గా అభివృద్ధి చేయొచ్చని నివేదిక ఇచ్చారు. కానీ, వారి ప్రతిపాదనలను అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు. గడిచిన పదేండ్లలో కనకగిరి అడవులను గుర్తించడం కానీ నివేదికలను పరిశీలించడం కానీ చేయలేదు. కాంగ్రెస్​ ప్రభుత్వం బడ్జెట్​ కేటాయించడంతో ఈ ఎకో టూరిజం అభివృద్ధి కానుంది. 

 ట్రిక్కింగ్​.. బోటింగ్.. 

పెనుబల్లి మండలం కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా లో వేల ఎకరాల్లో కనకగిరి అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లోనే పులిగుండాల ప్రాజెక్ట్ ఉంది. సుమారు 50 ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్ట్ కింద పెనుబల్లి, కల్లూరు మండలాల్లో ఉన్న ఏడువందల ఎకరాల్లో గిరిజన రైతుల సాగుభూములు ఉన్నాయి.  ఈ ప్రాంతం లో ట్రెక్కింగ్​, బోటింగ్ ఏర్పాటు చేయడం తో పాటు రాత్రి పూట బస ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఇంకా పెరుగుతారని ఇక్కడ నిరుద్యోగ గిరిజన యువకులకు ఉపాధి కూడా దొరుకుతుందని 
భావిస్తున్నారు.

గిరిజన నిరుద్యోగులకు  వరంగా మారుతుంది

కనకగిరి అడవులను ఎకో టూరిజం డెవలప్ చేయడం వల్ల ఆ అడవులలో ఉన్న పులిగుండాల ప్రాజెక్ట్ కు మహర్ధశ కలుగుతుంది. అడవుల అభివృద్ధి చేయడం వల్ల గిరిజనులకు ఉపాధి పెరుగుతుంది. ఎకో టూరిజం డెవలప్మెంట్ తో పర్యాటకులు పెరగడం తో పాటు గిరిజన నిరుద్యోగులకు ఉద్యోగాలు, ఉపాధి దొరుకుతాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఎకో టూరిజం డెవలప్మెంట్ కి నిధులు కేటాయించడం హర్షణీయం.

-లక్కినేని అలేఖ్య ఎంపీపీ పెనుబల్లి