యాదాద్రి ఆలయానికి మరింత పోలీస్ భద్రతను పెంచిన ప్రభుత్వం

ప్రముఖ దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ భద్రతపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి పెట్టింది.  ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ  ఆలయానికి మరింత భధ్రతను పెంచింది. ప్రస్తుతం ఉన్న భద్రతా సిబ్బందికి తోడు మరికొంత మందిని నియమించింది. ఇటీవలే ఏసీపీ స్థాయి అధికారితో పాటు టీఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ గా ప్రత్యేకంగా ప్రభుత్వం నియమించింది.  తాజాగా యాదాద్రి ఆలయానికి పోలీస్ భద్రత పెంచిన క్రమంలో 34 మంది అదనపు ఎస్పీఎఫ్ సిబ్బందిని నియమించారు. 

34 మందిని అదనంగా నియమించగా ఎస్పీఎఫ్ కమాండెంట్ త్రినాథ్ సమక్షంలో నేడు 17 మంది సిబ్బంది విధుల్లో చేరారు. అద్భుతమైన దివ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను సందర్శించే భక్తులకు రక్షణ.. ఆలయ పరిసరాల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని  ప్రభుత్వం నిర్ణయించింది. కొండపైన ప్రతీ కోణంలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. యాదాద్రిలో విధులు నిర్వహించే పోలీసులకు  ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలను సమకూర్చనున్నారు.