న్యూఢిల్లీ: ఎంపిక చేసిన కొన్ని స్మాల్సేవింగ్స్ స్కీములపై వడ్డీ రేటును 0.30 శాతం మేర ప్రభుత్వం పెంచింది. జులై–సెప్టెంబర్ మూడు నెలల కాలానికి ఈ కొత్త రేట్లు వర్తిస్తాయి. బ్యాంకింగ్ సిస్టమ్‌లోని అధిక వడ్డీ రేట్లకు అనుగుణంగా ఈ మార్పును చేశారు. అయిదేళ్ల రికరింగ్ డిపాజిట్‌పై వడ్డీ రేటును 0.30 శాతం పెంచారు.
ఇక మీదట ఆర్డీ డిపాజిట్ హోల్డర్లు 6.50 శాతాన్ని వడ్డీగా పొందుతారు. పోస్టాఫీసులలో ఏడాది కాల పరిమితి డిపాజిట్లపై వడ్డీ 0.1 శాతం పెంచారు. పీపీఎఫ్, సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ల వడ్డీ రేట్లు మారలేదు. పాత రేట్లే కొనసాగుతాయి.