జగిత్యాల జిల్లాలో కొత్త మండలంగా బండలింగాపూర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: జగిత్యాల జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటుకానుంది. బండలింగాపూర్‌‌‌‌ గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌‌‌‌ జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ ప్రిన్సిపల్​సెక్రటరీ నవీన్​ మిట్టల్​సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మెట్‌‌‌‌పల్లిలోని పది గ్రామాలతో బండలింగాపూర్‌‌‌‌ మండలాన్ని ప్రతిపాదించారు. 15 రోజుల్లో అభ్యంతరాలు, వినతులకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 18 మండలాలు ఉండగా.. 380 గ్రామాలున్నాయి. మరో వైపు సంగారెడ్డి నుంచి కామారెడ్డి జిల్లాకు బాబుల్‌‌‌‌గాం గ్రామాన్ని బదలాయించారు.

ALSO READ:పిడుగు పాటు, వర్షాల కారణంగా మొత్తం 20 మంది మృతి