సుడా పరిధిలోకి సూర్యాపేట జిల్లా

సుడా పరిధిలోకి సూర్యాపేట జిల్లా
  • ఐదు మున్సిపాలిటీలు, 264 గ్రామాలు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట జిల్లా మొత్తాన్ని సూర్యాపేట అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీ(సుడా) పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలైన సూర్యాపేట, తిరుమలగిరి, కోదాడ, నేరేడుచర్ల, హుజుర్‌‌‌‌నగర్‌‌‌‌తో పాటు 21 మండలాల్లోని 264 గ్రామ పంచాయతీలను కలుపుతూ సూర్యాపేట అర్బన్‌‌‌‌డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌అథారిటీ(సుడా) ఏర్పాటైంది. 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాబట్టుకోవడంతో పాటు లే అవుట్​ ఛార్జీలు, బిల్డింగ్ పర్మిషన్స్ ద్వారా స్వయం సమృద్ధి అయ్యేందుకు సుడా పని చేయనుంది. సుడా పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని ఆయా గ్రామాలు, మున్సిపాలిటీల్లో రోడ్లు, పార్కులు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్. డివైడర్ల నిర్మాణానికి ఖర్చు చేయవచ్చు.సుడా ఏర్పాటుకు కావాల్సిన మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల వివరాల ప్రతిపాదనలు గతంలో జిల్లా ఉన్నతాధికారులు పంపించారు. ప్రతిపాదనల మేరకు సూర్యాపేట అర్బన్‌‌‌‌డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌అథారిటీ(సుడా)ను ఏర్పరుస్తూ సుడా పరిధిలో ఐదు మున్సిపాలిటీలు, 264 గ్రామ పంచాయతీలను చేర్చారు.

మెరుగుపడనున్న మౌలిక వసతులు

 గ్రామ పంచాయతీల్లో మౌలిక వసతులు, రోడ్లు, నీటి సరఫరా ఇతర మౌళిక వసతుల కల్పన మెరుగుపడనుంది. గతంలో హెచ్‌‌‌‌ఎండీఏ(హైదరాబాద్‌‌‌‌మెట్రో పాలిటన్‌‌‌‌అభివృద్ది అథారిటీ) చేసిన అభివృద్ధి తరహాలో తాజాగా సుడా కూడా అర్బన్​ ఏరియాల్లో రహదారుల నిర్మాణం, నీటి సరఫరా, ఉద్యోగ అవకాశాలు వంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగనున్నాయి. 

సూర్యాపేట అర్బన్‌‌‌‌డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌అథారిటీగా నామకరణం

సుడా ఏర్పాటు వల్ల అర్బన్‌‌‌‌డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీ నిర్వాహణలో భాగంగా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోనున్నాయి. అర్బన్‌‌‌‌పరిధిలో శాటిలైట్‌‌‌‌ టౌన్‌‌‌‌ షిప్‌‌‌‌లు వచ్చే ప్రణాళికలను ప్రభుత్వం రూపొందించనుంది. వివిధ రకాల కంపెనీల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగనున్నాయి. తాజా ఉత్తర్వుల్లో భాగంగా జిల్లా అర్బన్‌‌‌‌డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీని సూర్యాపేట అర్బన్‌‌‌‌డెవల్‌‌‌‌మెంట్‌‌‌‌ అథారిటీగా నామకరణం చేశారు. ఇందులో కలెక్టర్‌‌‌‌ చైర్మన్‌‌‌‌గా, ప్రిన్సిపల్‌‌‌‌సెక్రటరీ, డైరెక్టర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మున్సిపల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్, డైరెక్టర్‌‌‌‌ అఫ్‌‌‌‌ టౌన్‌‌‌‌ అండ్​ కంట్రి ప్లానింగ్‌‌‌‌ అధికారులు సభ్యులుగా ఉంటారు.