బుద్ధభవన్​లోనే హైడ్రా పోలీస్ స్టేషన్ .. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

బుద్ధభవన్​లోనే హైడ్రా పోలీస్ స్టేషన్ .. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

హైదరాబాద్​సిటీ, వెలుగు: ప్రస్తుతం హైడ్రా ఆఫీస్ ​కొనసాగుతున్న బుద్ధభవన్​లోనే హైడ్రా పోలీస్​స్టేషన్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. బుద్దభవన్ బి–బ్లాక్​లో హైడ్రా పోలీస్ స్టేషన్​పెట్టాలని పేర్కొంది. ఈ స్టేషన్​ఎస్ హెచ్ఓగా ఏసీపీ స్థాయి ఆఫీసర్​ను నియమించారు. హైడ్రాకు చైర్మన్​గా రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవహరిస్తారు. 

హైడ్రా ప్రధానంగా చెరువులు, నాలాలు, పార్కులు, లేఔట్స్, ఓపెన్​ప్లాట్స్, ప్లే గ్రౌండ్స్, ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తుందని, ప్రభుత్వ భూములు కబ్జాకు గురికాకుండా మానిటర్​చేస్తుందని అధికారులు తెలిపారు. ఇక నుంచి భూ కబ్జాలు, ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం, ఇతర కేసులకు  సంబంధించి హైడ్రాకు ఫిర్యాదు చేయాలనుకునే వారు ఈ స్టేషన్​లో సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. హైడ్రా పీఎస్​లో ఫిర్యాదులను స్వీకరిస్తారు.