- అర్హత ఉన్న ప్లాట్లకు రెగ్యులరైజేషన్
- ఉమ్మడి మెదక్ జిల్లాలో 1.46 లక్షల దరఖాస్తులు
మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు: ఎల్ఆర్ఎస్ (ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం) కు ఇటీవల ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ఇవ్వడంతో మున్సిపల్ అధికారులు దరఖాస్తుల పరిష్కారానికి చర్యలు మొదలుపెట్టారు. మున్సిపల్టౌన్ప్లానింగ్, ఇరిగేషన్, ఎండోమెంట్, వక్ఫ్ బోర్డ్అధికారుల బృందం ఫీల్డ్వెరిఫికేషన్ చేస్తోంది. వెంచర్లు, ప్లాట్లు ఎండోమెంట్ భూమిలో, ఇనాం, వక్ఫ్‌భూమిలో, చెరువు శిఖం, బఫర్జోన్పరిధిలో ఉన్నాయా అనేది పరిశీలిస్తున్నారు. అలాంటి వాటిని పక్కనబెట్టి అర్హత ఉన్న వాటి రెగ్యులరైజేషన్‌కు అనుమతి ఇస్తారు.
నోటీసులు అందిన తర్వాత నిర్ణీత ఫీజు చెల్లిస్తే రెగ్యులరైజ్చేస్తారు. దీంతో అనుమతి లేని వెంచర్లలో కొనుగోలు చేసిన ప్లాట్లలో ఇళ్ల నిర్మాణ అనుమతులకు, క్రయ విక్రయాలకు ఎదురవుతున్న ఇబ్బందులు తొలగిపోనున్నాయి. అంతేగాక ఎల్ఆర్ఎస్ద్వారా మున్సిపాలిటీలకు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరనుంది.గత బీఆర్ఎస్ప్రభుత్వం 2020 ఆగస్టు 26కు ముందు రిజిస్టర్‌అయిన అనుమతి లేని లే ఔట్ ప్లాట్లను రెగ్యులరైజ్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ తీసుకొచ్చింది. ఈ మేరకు మున్సిపల్ అధికారులు అప్పట్లో దరఖాస్తులు తీసుకున్నారు.
అనధికార లే ఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ప్రభుత్వం నిబంధనల ప్రకారం ఒక్కో ప్లాట్ కు వెయ్యి రూపాయల చొప్పున ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు. కానీ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ను అమలు చేయకుండా పెండింగ్‌లో పెట్టింది. దీంతో నాలుగేళ్లుగా దరఖాస్తు దారులకు ఎదురు చూపులు తప్పలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి జిల్లాలోని మున్సిపల్పట్టణాల పరిధిలో నాలుగేళ్లలో ఇబ్బడి ముబ్బడిగా వెంచర్లు వెలిశాయి. నిబంధనల ప్రకారం మున్సిపల్ శాఖ నుంచి పర్మిషన్తీసుకొని అన్నిమౌలిక వసతులతో వెంచర్ ఏర్పాటు చేయాలి. కానీ అది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కావడంతో చాలామంది రియల్టర్లు అనుమతులు తీసుకోకుండానే ప్లాట్లు చేసి అమ్మేస్తున్నారు.
దీంతో అనుమతి లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు ఇళ్లు నిర్మించుకునేందుకు పర్మిషన్లు, బ్యాంక్లోన్లు లభించక ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి మెదక్జిల్లాలో17 మున్సిపాల్టీలు, ఒక అర్బన్డెవలప్మెంట్అథారిటీ (సుడా) ఉన్నాయి. వాటన్నింటి పరిధిలో 1,46,826 ఎల్ఆర్ఎస్దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో అత్యధికంగా సిద్దిపేట జిల్లాలో 90,091 దరఖాస్తులు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో 42, 228 దరఖాస్తులు ఉండగా మెదక్జిల్లాలో 14,507 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.