హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి నిధులు విడుదల చేసింది ప్రభుత్వం. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని 250 పడకల ఆసుపత్రిగా మార్చడానికి రూ. 82 కోట్ల రూపాయలను విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం.
ఈ మేరకు రాష్ట్ర హెల్త్, మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నిధులు విడుదల చేస్తూ అనుమతులు జారీ చేసింది. మరో వైపు హుస్నాబాద్ కి 250 పడకల ఆసుపత్రి రావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.
Also Read :- ప్రభుత్వ నిర్ణయంతో పండగ చేసుకుంటున్న జీహెచ్‌ఎంసీ ఉద్యోగులు
పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక హుస్నాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. మరో వైపు హుస్నాబాద్ ఆసుపత్రిని 250 పడకల ఆసుపత్రిగా మార్చడానికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకి ,వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకి ధన్యవాదాలు తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్..