జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కోసం స్పెషల్ కమిటీ

జర్నలిస్టుల అక్రెడిటేషన్ కార్డుల కోసం స్పెషల్ కమిటీ
  • గైడ్​లైన్స్ రూపొందించనున్న ప్యానెల్

హైదరాబాద్, వెలుగు: జర్నలిస్టులకు ఇచ్చే అక్రిడిటేషన్ కార్డుల గైడ్​లైన్స్ రూపకల్పన కోసం ప్రభుత్వం స్పెషల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో నంబర్ 1395ను గురువారం రిలీజ్ చేసింది. మీడియా అకాడమీ చైర్మన్​గా వ్యవహరిస్తున్న శ్రీనివాస్ రెడ్డి.. ఈ స్పెషల్ కమిటీకి చైర్మన్​గా వ్యవహరిస్తారు.

సభ్యులుగా వీ6 న్యూస్ సీఈవో అంకం రవి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే.శ్రీనివాస్, హిందూ పొలిటికల్ ఎడిటర్ ఆర్.రవికాంత్ రెడ్డి, సియాసత్ న్యూస్ ఎడిటర్ అమీర్ ఖాన్, నవ తెలంగాణ సీనియర్ ఫొటోగ్రాఫర్ నరహరితో పాటు ఐ అండ్ పీఆర్ స్పెషల్ కమిషనర్ ఉంటారు. కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గైడ్​లైన్స్ ను రివ్యూ చేసి.. కొత్త మార్గదర్శకాలను ఈ స్పెషల్ కమిటీ రూపొందిస్తుందని జీవోలో పేర్కొన్నది.