మెడికల్ అడ్మిషన్ల పర్యవేక్షణకు టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌

మెడికల్ అడ్మిషన్ల పర్యవేక్షణకు టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎంబీబీఎస్‌‌‌‌, మెడికల్  పీజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియ, ప్రభుత్వ దవాఖాన్లలో వసతుల కల్పనను పర్యవేక్షించేందుకు ప్రభుత్వం  టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌‌‌‌  చొంగ్తు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌లో డీఎంఈ మెంబర్  సెక్రటరీగా వ్యవహరించనుండగా, డీఎంఈ (అకడమిక్‌‌‌‌), హెల్త్‌‌‌‌  వర్సిటీ రిజిస్ట్రార్‌‌‌‌, ఉస్మానియా, గాంధీ మెడికల్‌‌‌‌  కాలేజీల ప్రిన్సిపాళ్లు సభ్యులుగా ఉంటారని పేర్కొంది.

 రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌‌‌‌  మెడికల్‌‌‌‌  కాలేజీల్లో ఎంబీబీఎస్‌‌‌‌, పీజీ సీట్ల అడ్మిషన్ల ప్రక్రియను టాస్క్‌‌‌‌ఫోర్స్‌‌‌‌  పర్యవేక్షించనున్నది. దీంతోపాటు మెడికల్  కాలేజీల్లో బయోమెట్రిక్‌‌‌‌  అటెండెన్స్‌‌‌‌, అవుట్ పేషెంట్‌‌‌‌, ఇన్‌‌‌‌పేషెంట్ సర్వీసులు, మాతాశిశు సంరక్షణ సేవలు, ఫోరెన్సిక్  సేవలు తదితర అన్ని విభాగాల్లో వసతుల కల్పనపై దృష్టి పెట్టనున్నది. ఈ అంశాలపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సెక్రటరీ పేర్కొన్నారు.