గతకొద్దిరోజులుగా తెలంగాణ రాష్ట్ర స్పెషల్ పోలీసులు ఏక్ స్టేట్ ఏక్ పోలీస్ విదానం కోసం ఆందోళనలు చేస్తున్నారు. బెటాలియన్ కానిస్టేబుళ్ల కుటుంబాలు రోడ్లపై దర్నాకు దిగాయి. స్పెషల్ పోలీస్ కానిస్టేబుల్స్, వారి కుటుంబాలను రెచ్చగొట్టిన పలువురు పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ మేరకు వారిపై తెలంగాణ ప్రభుత్వం సస్పెన్షన్ విధించింది.
ఏడు బెటాలియన్ల పరిధిలో మొత్తం 39 మందిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 3వ బెటాలియన్ ఇబ్రహీంపట్నం, 4వ బెటాలియన్ మమ్నూర్, 5వ బెటాలియన్ చల్వాయి, 6వ బద్రాద్రి కొత్తగూడెం , 12వ బెటాలియన్ అన్నెపర్తి, 13వ బెటాలియన్ మంచిర్యాల, 17వ బెటాలియన్ సిరిసిల్ల లో పలువురు కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేశారు.