- ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో భారీగా మున్సిపల్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్ అండ్ అర్బన్ డెవలప్ మెంట్ సెక్రటరీ సుదర్శన్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 22 మంది కమిషనర్లను బదిలీ చేశారు. సీడీఎంఏ నుంచి జీహెచ్‌ఎంసీకి బీ గీతను బదిలీ చేశారు. సీడీఎంఏ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్‌గా టి.మోహనకృష్ణ రెడ్డిని నియమించారు. బడంగ్‌పేట మున్సిపల్ కమిషనర్‌గా బి.సుమన్ రావును, రామగుండం కార్పొరేషన్ కమిషనర్‌గా సీహెచ్ నాగేశ్వర్‌ను ట్రాన్స్ ఫర్ చేశారు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్‌కు ప్రమోషన్ కల్పిస్తూ తుర్కయాంజల్ కమిషనర్‌గా బదిలీ చేశారు. జీహెచ్‌ఎంసీ డిప్యూటీ కమిషనర్‌గా కె.నారాయణరావును బదిలీ చేయగా.. దమ్మాయిగూడ కమిషనర్ ఎ.స్వామికి పదోన్నతి కల్పిస్తూ పాల్వంచ కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించారు. మిర్యాలగూడ కమిషనర్ పి.రవీంద్ర సాగర్‌కూ ప్రమోషన్ కల్పిస్తూ ఇబ్రహీంపట్నం కమిషనర్‌గా బదిలీ చేశారు. జి.రాజేంద్ర కుమార్‌ను నగర కమిషనర్‌గా, పోచారం అసిస్టెంట్ కమిషనర్ ఎ.సురేశ్ ను జీహెచ్‌ఎంసీకి, ఎండీ సాబీర్ అలీని ఘట్ కేసర్ కమిషనర్‌గా నియమించారు. ఎంపీ పూర్ణచందర్ రెడ్డిని మిర్యాలగూడ, ఎస్.రవీంద్ర రెడ్డిని పెద్ద అంబర్‌పేట, బి.సత్యనారాయణ రెడ్డిని ఖమ్మం, కె.వేణుమాధవ్‌ను నందికొండ, పి.వేమన్ రెడ్డిని పోచారం కమిషనర్‌గా బదిలీ చేశారు.