తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. నల్లగొండ ఎస్పీగా చందనా దీప్తిని ప్రభుత్వం నియమించింది. సీఐడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్పీ గా అపూర్వ రావును బదిలీ చేశారు.
ప్రస్తుతం నల్లగొండ ఎస్పీగా కొనసాగుతున్న అపూర్వ రావును బదిలీ చేసి ఆమె స్థానంలో వేకెన్సీ రిజర్వ్ లో ఉన్న చందనా దీప్తిని నల్లగొండ ఎస్పీగా నియమించింది. అపూర్వ రావుకు ఐసీడీ ఉమెన్ ప్రొటెక్షన్ ఎస్సీగా బాధత్యలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
చందనా దీప్తి ఇంతకుముందు నార్త్ జోన్ డీసీపీగా పనిచేశారు. ఇటీవల పలువురు ఐపీఎస్ లను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. చందనా దీప్తిని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేసింది. తాజాగా నల్లగొండ ఎస్పీగా బాధ్యతలు అప్పగించింది.