ఉస్మానియా హాస్పిటల్ రికార్డ్.. డాక్టర్‌కే సర్జరీ : ఫ్రీగా 4 కిడ్నీ, 2 లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్లు

హైదరాబాద్‌లోని ఉస్మానియా ప్రభుత్వం ఆసుపత్రి ఓ రికార్డ్ నెలకొల్పింది. రెండు నెలల్లోనే ఆరు అవయవ మార్పిడి ఆపరేషన్లను డాక్టర్లు విజయవంతంగా చేశారు. అది కూడా రూపాయి ఖర్చు లేకుండా ఫ్రీగా ఆరోగ్య స్త్రీ పథకం కింద. గవర్నమెంట్ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ నిర్లక్ష్యం చేస్తారని సామాన్య ప్రజలు భావిస్తుంటారు. కానీ, ఇక్కడ విశేషం ఏంటంటే.. ప్రస్తుతం సూర్యాపేట మెడికల్ కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్‌‌గా పనిచేస్తున్న డాక్టర్ రవిసుందర్ ఉస్మానియా హాస్పిటల్ లో లివర్ ప్లాంటేషన్ చేయించుకున్నారు. 

ALSO READ | Good Health : మీ ఊపిరితిత్తులు బాగుండాలంటే.. ఈ 5 అలవాట్లు మానుకోండి..!

ఇన్ఫెక్షన్ తో లివర్ పాడైన డాక్టర్ రవి సుందర్ కి ప్రొఫెసర్ మధుసుదన్ తోపాటు ఆయన టీం ఆగస్ట్ 29న లివర్ ప్లాంటేషన్ ఆపరేషన్ చేశారు.  అంతేకాదు జీవితాంతం పేషెంట్లకు ఉచితంగా మెడిసిన్ ఇవ్వనున్నట్లు ఉస్మానియా హాస్పిటల్ డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య స్త్రీ పథకం కింద ఉచితంగా అవయవ మార్పిడి సర్జరీలు చేస్తున్నామని డాక్టర్లు చెప్తున్నారు. గతం రెండు నెలలోనే ఉస్మానియా హాస్పిటల్లో 4 కిడ్నీ, 2 లివర్ ట్రాన్స్‌ ప్లాంటేషన్ సర్జరీలు జరిగాయి.The Osmania