24 గంటలు వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

24 గంటలు వైద్య సేవలు అందించాలి : కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ 

జనగామ అర్బన్,  వెలుగు : రోగులకు వైద్యులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని 24 గంటలు వైద్య సేవలు అందించాలని జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్ అన్నారు. గురువారం జనగామ జిల్లా డిస్ట్రిక్ట్​ హస్పిటల్​ ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదరం క్యాంపు నిర్వహణ తీరును పరిశీలించారు. డాక్టర్లతో, రోగులతో మాట్లాడారు. హస్పిటల్​ ను ఎల్లవేళల పరిశుభ్రంగా ఉంచాలని, వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉంటూ అందుబాటులో ఉండాలన్నారు.

డాక్టర్​ అనురాధ తో కలిసి వివిధ రకాల సర్జరీలు చేయించుకున్న స్త్రీ, పురుషుల వార్డులను సందర్శించి రోగులను పలకరించారు. అనంతరం కంటి వైద్య విభాగాన్ని పరిశీలించారు. సిటీ స్కాన్​ ను, లిప్ట్​ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు కేశవనాథ్​, అశోక్​ కుమార్, కంటి వైద్య డాక్టర్​ సృజన్​ కుమార్, సిబ్బంది ఖాజా పాషా, తదితరులు పాల్గొన్నారు.