
- డీపీఐఐటీతో పేటీఎం ఒప్పందం
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు మెంటర్‌షిప్, మౌలిక సదుపాయాల మద్దతు, మార్కెట్ యాక్సెస్, నిధుల అవకాశాలను అందించడానికి కేంద్రం ప్రభుత్వం పేటీఎంతో ఒక ఒప్పందం కుదుర్చుకుంది.
మనదేశంలో తయారీ, ఫిన్‌టెక్ స్టార్టప్‌ల వృద్ధిని వేగవంతం చేయడానికి, ఇన్నోవేషన్లను ప్రోత్సహించడానికి పేటీఎంతో పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) అవగాహన ఒప్పందం (ఎంఓయూ)పై సంతకం చేసిందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమ మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఒప్పందం వల్ల ఫిన్టెక్ స్టార్టప్లకు ఎంతో మేలు జరుగుతుందని... మెంటార్షిప్, ఇన్నోవేషన్ గైడెన్స్ లభిస్తుందని డీపీఐఐటీ తెలిపింది.