భద్రాచలం, వెలుగు: మావోయిస్టుల రాజధానిగా పిలిచే బస్తర్దండకారణ్యంలోని అబూజ్మాఢ్లో తొలి సైనిక స్థావరాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇండియన్ఆర్మీ బేస్‌క్యాంపు ఏర్పాటుకు అవసరమయ్యే భూమి కోసం సర్వే చేయాలని ఛత్తీస్‌గఢ్ సర్కార్ నారాయణ్పూర్జిల్లా కలెక్టర్‌కు లేఖ రాసింది. పదేండ్ల కింద నేటి కొండగావ్ జిల్లా కేంద్రంలో ఆర్మీ జవాన్లకు ట్రైనింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. మావోయిస్టుల వేటలో ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటి వరకు పారామిలటరీ బలగాలు మాత్రమే పని చేస్తున్నాయి.
ఎస్ఎస్బీ, బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్టీఎఫ్, కోబ్రా, సీఆర్పీఎఫ్, ఆయా జిల్లాల్లో డీఆర్జీ, జిల్లా బలగాలు, బస్తర్‌ఫైటర్స్, బస్తరీయ బెటాలియన్తదితర పారా మిలటరీ బలగాలు పని చేస్తున్నాయి. 60 వేల మంది జవాన్లు నక్సల్స్‌పై పోరులో పని చేస్తున్నారు. ఇండియన్ఆర్మీ బేస్ క్యాంపును ఏర్పాటు చేయడం ద్వారా సైన్యంతో నక్సలిజాన్ని అణచి వేసేందుకు కేంద్ర ప్రభుత్వం యాక్షన్ షురూ చేసింది. ఇటీవలే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల డీజీపీలతో కీలక సమావేశం నిర్వహించారు. మీటింగ్అనంతరం మావోయిస్టులపై పోరులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.