అప్పాయిపల్లి రైతులకు ప్లాట్ల పట్టాలు

అప్పాయిపల్లి  రైతులకు ప్లాట్ల పట్టాలు

కొడంగల్, వెలుగు: కొడంగల్​ మెడికల్, వెటర్నరీ కాలేజీ నిర్మాణంలో భూములు కోల్పోతున్న అప్పాయిపల్లి రైతులకు ప్రభుత్వం ఇండ్ల పట్టాల పంపిణీ చేస్తోంది. గురువారం కొడంగల్​తహసీల్దార్ విజయ్​కుమార్, సబ్​రిజిస్ట్రార్​రవికాంత్​రైతులకు ఇండ్ల పట్టాలు అందజేశారు.

 కొడంగల్​మండలం అప్పాయిపల్లి సర్వే నంబర్–19లో డీటీసీపీ లేఅవుట్​లో ఏకరాకు 125 గజాల ప్లాట్, రూ.10 లక్షలు క్యాష్, ఇంటికో ఉద్యోగం, ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం 61 మంది రైతులకు ప్రభుత్వం సహకారం అందిస్తుందని తెలిపారు. రిజిస్ట్రేషన్​ ఖర్చులు లేకుండా ప్రభుత్వమే రైతులకు ఫ్రీగా పట్టా చేసి ఇస్తోందని స్పష్టం చేశారు.