- జిల్లాలో 13,064 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లు
- 2024 - 25 లోన్ల టార్గెట్ రూ.592.62 కోట్లు
- ఇప్పటికే రూ.454.53 కోట్లు మంజూరు
- చిరు వ్యాపారాలతో ఉపాధి పొందుతున్న మహిళలు
మెదక్, వెలుగు: మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ ద్వారా విరివిగా రుణాలు అందిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) ద్వారా సెల్ప్‌హెల్ప్ గ్రూప్ (ఎస్ హెచ్‌జీ) లకు లోన్లు మంజూరు చేయడంలో మెదక్ జిల్లా స్టేట్‌లో ముందుంది. జిల్లాలోని 21 మండలాల్లో మొత్తం 13,064 సెల్ప్ హెల్ఫ్ గ్రూప్ లు ఉన్నాయి, వీటిలో 1,37,654 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 521 వీఓఏలు, 21 మండల సమాఖ్యలు, ఒక జిల్లా సమాఖ్య ఆధ్వర్యంలో ఎస్ హెచ్ జీలు పని చేస్తున్నాయి.
సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలు స్వయం ఉపాధి ద్వారా ఆర్థిక స్వావలంబన సాధించేందుకు బ్యాంక్ లింకేజీ ద్వారా విరివిగా రుణాలు మంజూరు చేస్తున్నారు. 2024– 25 ఆర్థిక సంవత్సరంలో జిల్లా వ్యాప్తంగా 10,664 సెల్ప్ హెల్ప్ గ్రూప్ లకు బ్యాంక్‌లింకేజీ కింద రూ.592 .61 కోట్ల వరకు లోన్లు మంజూరు చేయాలని అధికారలు టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో ఇప్పటి వరకు 5,501 ఎస్ హెచ్ జీలకు రూ.454.53 కోట్ల రుణాలు మంజూరు చేసి.. 76.70 శాతంటార్గెట్ పూర్తి చేశారు.
శివ్వంపేట, నార్సింగి మండలాల్లో 100 శాతానికి మించి రుణాలు అందించగా, నర్సాపూర్, కౌడిపల్లి, తూప్రాన్ మండలాల్లో టార్గెట్ కంప్లీట్ చేయడానికి దగ్గరగా ఉన్నారు. ఫైనాన్షియల్ ఇయర్ ముగియడానికి ఇంకా మూడు నెలల వ్యవధి ఉంది. ఈ మూడు నెలల్లో అన్ని మండలాల్లో టార్గెట్ పూర్తి చేసేందుకు అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకుంటున్నారు.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాలో పర్యటించినప్పుడు సెల్ప్ హెల్ప్ గ్రూప్ లకు రూ.102 కోట్ల రుణాల చెక్కును అందించారు. బ్యాంక్ లింకేజీ కింద స్వయం సహాయక సంఘాలకు అందిస్తున్న రుణాలతో మహిళలు కిరాణ షాప్‌లు, బ్యాంగిల్ స్టోర్లు, జిరాక్స్ సెంటర్లు, రెడీమెడ్ క్లాత్ స్టోర్తదితర వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో చాలామంది మహిళలు వ్యాపారాల్లో రాణిస్తూ తమ కాళ్ల మీత తాము నిలబడుతున్నారు.
మండలాల వారీగా లోన్ల వివరాలు..
మండలం సంఘాలు టార్గెట్ పూర్తయ్యింది
శివ్వంపేట 622 2,685 2,920
నార్సింగి 287 1,634 1,659
నర్సాపూర్ 582 3,724 3,666
కౌడిపల్లి 547 2,834 2,638
తూప్రాన్ 359 2,185 2,025
మెదక్ 505 2,725 2,434
చేగుంట 747 3,866 3,263
హెచ్ఘనపూర్ 608 3,045 2,466
నిజాంపేట 462 2,426 1,862
అల్లాదుర్గం 460 2,893 2,135
మనోహరాబాద్ 438 2,868 2,096
కొల్చారం 619 3,515 2,539
చిన్నశంకరంపేట 700 4,078 2,781
టేక్మాల్ 471 2,014 1,363
వెల్దుర్తి 706 3,304 2,201
పాపన్నపేట 732 4,646 2,995
రామాయంపేట 421 2,048 1,295
పెద్దశంకరంపేట 671 4,086 2,506
రేగోడ్ 383 2,708 1,590
చిలప్‌చెడ్ 344 1,968 1,010