బీసీ గురుకులాలపై ప్రభుత్వం చిన్న చూపు : కవిత

బీసీ గురుకులాలపై ప్రభుత్వం చిన్న చూపు : కవిత
  • విదేశీ విద్యను అభ్యసించే వారికి నిధులు ఎందుకు ఇవ్వట్లేదు: కవిత

హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకులాలను రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. శాసనమండలిలో సోమవారం ఆమె మాట్లాడుతూ.. గురుకులాల్లో కొత్త మెనూ ఎప్పటి నుంచి అమలవుతుందో చెప్పాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో గురుకులాల నాణ్యత కూడా పడిపోయిందని విమర్శించారు. 

నిత్యం ఎక్కడో ఒక చోట ఫుడ్ ఫాయిజనింగ్ కేసు నమోదవుతోందని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క బీసీ గురుకుల పాఠశాల కూడా ఏర్పాటు చేయలేదని చెప్పారు. విదేశీ విద్యను అభ్యసిస్తున్న బీసీ విద్యార్థులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. జగిత్యాల కేంద్రంగా సిల్క్ వార్మ్ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్నారు. రైతులను మల్బరీసాగు వైపు ప్రోత్సహించాలని చెప్పారు. రాష్ట్రంలో తేనే టీగల పెంపకాన్ని ప్రోత్సహించాలని కోరారు.