* పోలీస్ రిక్రూట్మెంట్ లో గిరిజన యువతకు అన్యాయం చేస్తున్నరు
* సమతా పేరుతో విడుదల
రాయ్ పూర్: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సౌత్ సబ్ జోనల్ బ్యూరో సమతా పేరిట సంచలన లేఖను విడుదల చేశారు. ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం కార్పొరెట్ వర్గాలకు అనుకూలంగా పనిచేస్తోందని వారు ఆరోపించారు. అలాగే వారికోసమే రాష్ట్రంలో రోడ్లు, టెలిఫోన్లు, బ్రిడ్జిలు, రైల్వే లైన్స్ సహా పలు రకాల అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. సీఎం విష్ణుదేవ్ సాయి ఓ కార్పొరేట్ కు ఏజెంట్ గా పనిచేస్తున్నారని విమర్శించారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో గిరిజన యువతకు సడలింపులు ఇవ్వాలనే కెబినెట్
నిర్ణయంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. గిరిజన సమాజాన్ని నాశనం చేసే కుట్రను అంతా వ్యతిరేకించాలని నినదించారు. అందుకే పొలాలు, గ్రామాల్లో బాంబులు పెడుతున్నారని తెలిపారు. గిరిజన సమాజాన్ని కాపాడాలంటే ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వాలపై బలమైన ఉద్యమం జరగాలి అంటూ లేఖలో రాసుకొచ్చారు .