Beware Apple Users: యాపిల్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలున్నాయి..కేంద్రం సీరియస్ వార్నింగ్

Beware Apple Users: యాపిల్ ఫోన్లలో సెక్యూరిటీ లోపాలున్నాయి..కేంద్రం సీరియస్ వార్నింగ్

Beware Apple Users:మీరు యాపిల్ ఫోన్లు, ఇతర డివైజ్లు వాడుతున్నారా.. అయితేజాగ్రత్త..యాపిల్ ప్రాడక్టుల్లో సెక్యూరిటీ పరమైన లోపాలున్నాయని కేంద్రం సీరి యస్గా హెచ్చరిస్తోంది. ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT)  యాపిల్ ప్రాడక్టుల లోపాలపై హెచ్చరికలు జారీ చేసింది. హై సెక్యూరిటీ సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలిపింది.యాపిల్ ఉత్పత్తుల్లో  రిమోట్ కోడ్ అమలులో లోపాలున్నాయని సెర్ట్ కనిపెట్టింది. దీంతో హ్యాకర్లు ఈజీగా డేటా చోరీచేసే అవకాశం ఉందని హెచ్చరించింది. టార్గెటెడ్ సిస్టమ్లలో రిమోట్ యాక్సెస్ను పొందడం ద్వారా హ్యాకింగ్ గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 

CERT ప్రకారం..17.4.1 ముందు iOS, iPadOS వెర్షన్లను కలిగి ఉన్న iPhone, iPad లలో ఈ సెక్యూరిటీ లోపాలున్నాయి. ఈ వెర్షన్ iPhone, iPad Pro ల రెండో జరరేషన్, 1వ తరం iPad Pro 10.5, 3 వ జనరేషన్ iPad Air gen, iPad gen 6 తర్వాత అన్ని ఐఫోన్లకు అందుబాటులో ఉంది. 

ALSO READ :- బిల్డింగ్ పర్మిషన్ కోసం రూ. 50 వేల లంచం తీసుకుంటూ దొరికిండు

ఐఫోన్ 8, ఐఫోన్ 8ప్లస్, ఐఫోన్ ఎక్స్ , ఐప్యాడ్ జెన్ 5, 9.7 అంగుళా లఐప్యాడ్ ప్రో, 12.9 అంగుళాల ఐప్యాడ్ జెన్ 1 లో అందుబాటులో 16.7.7 అప్ డేట్ కు ముందున్న iOS, ఐప్యాడ్ వెర్షనలలో కూడా ఈ లోపాలున్నాయని సెర్ట్ వెల్లడించింది. 
1.1.1 ముందు Vision OS వెర్షనలలో ఉన్న లోపాలతో iPhone, iPac, MacBook లతోపాటు Vision Pro హెడ్ సెట్ లలో కూడా సెక్యూరిటీ లోపాలున్నట్లు సెర్ట్ చెపుతోంది.