కోహెడ(హుస్నాబాద్), వెలుగు : హుస్నాబాద్ గవర్నమెంట్హాస్పిటల్ను 100 పడకల నుంచి 250 పడకల హాస్పిటల్‌గా మారుస్తూ బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం రూ. 82 కోట్ల నిధులను మంజూరు చేసిందన్నారు. హాస్పిటల్అప్గ్రేడ్కు కృషి చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, హెల్త్ మినిస్టర్ దామోదార రాజనర్సింహాలకు మంత్రి పొన్నం కృతజ్ఞతలు తెలిపారు. హాస్పిటల్‌ను అప్‌గ్రేడ్ చేయడం పట్ల నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. హుస్నాబాద్‌లో కాంగ్రెస్ నాయకులు సీఎం, మంత్రుల ఫొటోలకు పాలాభిషేకం చేశారు.