
జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్‌లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వ్యాపారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. షేక్‌పేట మండలం సర్వే నంబరు 403/పిలో జీహెచ్ఎంసీ ట్రీ పార్కును ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఆ పక్కనే గుంటి శ్రీధర్‌రావు అనే వ్యాపారి ఇల్లు ఉంది. కాగా శ్రీధర్‌రావు ప్రభుత్వ స్థలంలోని 288 గజాల స్థలాన్ని చదును చేసి షెడ్లు నిర్మించడం స్టార్ట్చేశాడు.
గుర్తించిన షేక్‌పేట తహసీల్దార్ నోటీసులు జారీ చేసినా స్పందన లేదు. రాజకీయ పలుకుబడి ఉందంటూ అధికారులను బెదిరించాడు. సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిరాం, షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి, రెవెన్యూ అధికారులు కలిసి అక్రమ నిర్మాణాలను తొలగించారు. నిర్మాణ సామగ్రితోపాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారి శ్రీధర్‌రావుతోపాటు కాంట్రాక్టర్ నర్సింగరావుపైన పోలీసులు కేసు నమోదు చేశారు