సర్కార్ భూమి మల్లారెడ్డి కబ్జా

సర్కార్ భూమి మల్లారెడ్డి కబ్జా
  •  33 గుంటలు ఆక్రమించుకున్నారని రెవెన్యూ శాఖ నిర్ధారణ
  • హైకోర్టుకు నివేదిక అందజేత 
  • ప్రభుత్వ భూమికి రక్షణ కల్పించాలని పోలీసులకు సూచన 

హైదరాబాద్‌‌, వెలుగు: భూకబ్జా కేసులో బీఆర్‌‌ఎస్ మాజీ మంత్రి మల్లారెడ్డికి చుక్కెదురయ్యింది. మేడ్చల్ జిల్లా సుచిత్రలో మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు భూకబ్జాల కు పాల్పడినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించారు. 33 గుంటల భూమిని మల్లారెడ్డి కబ్జా చేసినట్లు నివేదిక లో వెల్లడించారు. డాక్యుమెంట్ల ప్రకారం మల్లారెడ్డికి 29 గుంటల భూమి మాత్రమే ఉందని పేర్కొన్నారు. 

సుచిత్రలోని సర్వే నంబర్‌‌‌‌ 82లోని వివాదాస్పద భూము లపై రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం హైకోర్టుకు నివేదిక అందించారు. ఈ భూవివాదంలో గతంలోనే 15 మంది బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. అయితే, కోర్టు కేసులు, ఆదేశాలు ఉన్నప్పటికీ.. 33 గుంటలకుపైగా ఆక్రమించుకున్నారని నివేదికలో వెల్ల డించారు. వివాదాస్పద భూమిలోకి అక్రమంగా ప్రవేశించారని తెలిపారు. 

ఫెన్సింగ్‌‌ను తొలగించి ఆక్రమించుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. సర్వే రిపోర్ట్‌‌ను కోర్టు ద్వారా సైబరాబాద్ పోలీసులకు అందజేశారు. ప్రభుత్వ భూమిలోకి ఇతరులు  అక్రమం గా ప్రవేశించకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.