న్యూఢిల్లీ: వన్ నేషన్ వన్ ఎలక్షన్’కు సంబంధించి రెండు బిల్లులను ఈ నెల 16వ తేదీన పార్లమెంట్‌లో బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. 129వ రాజ్యాంగ సవరణ కింద వన్ నేషన్ వన్ ఎలక్షన్, అలాగే, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి మేఘవాల్ తెలిపారు.
లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఒకేసారి నిర్వహించేలా ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ ఈ బిల్లుకు ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీంతో ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అలాగే, మూడు కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించిన చట్టాలను రాజ్యాంగ సవరణ బిల్లుతో అనుసంధానం చేసేందుకు చట్టాలను సవరించడానికి, ఒక సాధారణ బిల్లుతో సహా రెండు ముసాయిదా చట్టాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.