ఎస్సీ, ఎస్టీలకు భరోసా.. సామాజిక న్యాయం, సాధికారతకు రూ.13 వేల కోట్లు

ఎస్సీ, ఎస్టీలకు భరోసా.. సామాజిక న్యాయం, సాధికారతకు రూ.13 వేల కోట్లు
  • దివ్యాంగుల సంక్షేమానికి రూ.1,275 కోట్లు
  • పీఎం యశస్వి, పీఎం దక్ష్, శ్రేయస్, స్మైల్ స్కీమ్​లకు భారీగా నిధులు

న్యూఢిల్లీ: సామాజిక న్యాయ, సాధికారత శాఖకు రూ.13,611 కోట్లు కేటాయించారు. 2‌‌‌‌024–25 ఫైనాన్షియల్ ఇయర్​లో సవరించిన అంచనాల కంటే 35.75 శాతం అధికం. నిరుడు సోషల్ జస్టిస్, ఎంపవర్​మెంట్ శాఖకు రూ.10,026.40 కోట్లు కేటాయించారు. కాగా, దివ్యాంగుల సంక్షేమానికి ఈసారి రూ.1,275 కోట్లు అలకేట్ చేశారు. 2‌‌‌‌024–25 ఫైనాన్షియల్ ఇయర్​లో సవరించిన అంచనాల కంటే ఇది 9.22 శాతం అధికం. నిరుడు వికలాంగుల సంక్షేమం కోసం రూ.1,167.27 కోట్లు కేటాయించారు. స్కాలర్​షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఫర్ యంగ్ అచీవర్స్ స్కీమ్ (శ్రేయస్​) కోసం రూ.472 కోట్లు కేటాయించారు. 

ఎస్సీలకు నేషనల్ ఫెలోషిప్ కోసం రూ.212 కోట్లు, ఎస్సీ, ఓబీసీలకు ఫ్రీ కోచింగ్ కోసం రూ.20 కోట్లు, ఎస్సీలకు టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ కోసం రూ.110 కోట్లు, ఎస్సీలకు నేషనల్ ఓవర్సిస్ స్కాలర్​షిప్ కోసం రూ.130 కోట్లు అలొకేట్ చేశారు. ఓబీసీలు, ఈబీసీల కోసం శ్రేయస్ స్కీమ్ కింద ప్రత్యేకంగా రూ.250 కోట్లు కేటాయించారు. ఇందులో ఓబీసీలకు నేషనల్ ఫెలోషిప్ కోసం రూ.190 కోట్లు, ఓవర్సీస్ స్టడీస్ వడ్డీ రాయితీ కోసం రూ.60 కోట్లు అలొకేట్ చేశారు. ఓబీసీలు, ఈబీసీలు, డీ నోటిఫైడ్ గిరిజనుల కోసం తీసుకొచ్చిన పీఎం యంగ్ ఆచీవర్స్ స్కాలర్​షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా (పీఎం యశస్వి) కోసం రూ.2,190 కోట్లు కేటాయించారు. స్కిల్ డెవలప్​మెంట్ తీసుకొచ్చిన ప్రధాన్​మంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హిత్​గ్రాహి (పీఎం దక్ష్) కోసం రూ.130 కోట్లు అలొకేట్ చేశారు. ట్రాన్స్​జెండర్లు, యాచకుల రీ హాబిలిటేషన్ కోసం తీసుకొచ్చిన సపోర్ట్ ఫర్ మార్జినలైజ్డ్ ఇండివిజ్యువల్స్ ఫర్ లైవ్​లీ హుడ్ అండ్ ఎంటర్​ప్రైజెస్ (స్మైల్) స్కీమ్ కోసం రూ.106.87 కోట్లు కేటాయించారు. పారిశుధ్య పనుల్లో యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు తీసుకొచ్చిన నేషనల్ యాక్షన్ ఫర్ మెకనైజ్డ్ శానిటేషన్ ఎకో సిస్టమ్ (నమస్తే) స్కీమ్ కోసం రూ.130 కోట్లు అలొకేట్ చేశారు. ఎస్సీల పోస్ట్ మెట్రిక్ స్కాలర్​షిప్ కోసం రూ.6,360 కోట్లు, ప్రీ మెట్రిక్ స్కాలర్​షిప్ కోసం రూ.577.96 కోట్లు అలొకేట్ చేశారు.