చైనా డీప్ సీక్తో ప్రమాదమా..త్వరలో ఇండియాలో డీప్ సీక్ బ్యాన్?..ప్రభుత్వం ఏమంటుందంటే..

 చైనా డీప్ సీక్తో ప్రమాదమా..త్వరలో ఇండియాలో డీప్ సీక్ బ్యాన్?..ప్రభుత్వం ఏమంటుందంటే..

DeepSeek..చైనా ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్..2025 జనవరిలో ప్రారంభమైన DeepSeek..తక్కువఖర్చుతో నిర్మించబడిన ఓపెన్ సోర్స్ మోడల్ అని ప్రశంసలందు కుంది. అంతా బాగానే ఉందిగాని చైనాకు చెందిన ఈ ఏఐ మోడల్ తో భద్రతపరమైన ఇబ్బందులపై ఆందోళనలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఇటలీ, ఆస్ట్రేలియా సహ యూఎస్ ఫెడరల్ ఏజెన్సీలు DeepSeek వాడకాన్ని నిషేధించాయి. అధికారిక కంప్యూటర్లు, డివైజ్ లలో వాడటం లేదు. తాజాగా భారత ప్రభుత్వం కూడా DeepSeek పై సెక్యూరిటీపరమైన ఆందోళన వ్యక్తం చేసింది.. త్వరలో DeepSeek పై నిషేధం విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

చైనా AI సాధనం అయిన డీప్ సీక్ ను ఉపయోగించడం వల్ల నష్టాలు ఉన్నాయి. డేటా ప్రైవసీ, సైబర్ గూఢచర్యం, వినియోగదారులను డేటా స్టీల్ వంటి జరగవచ్చని ఇండియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయం CERT In తో దర్యాప్తులో తేలింది.  

ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం ( CERT-In ), తమ పరికరాల్లో genAI అప్లికేషన్‌ను ఉపయోగించి భారతీయ పౌరులకు కలిగే హాని గురించి విచారణ చేపట్టింది. 

Also Read : ఫ్యాక్టరీల్లో స్వచ్ఛమైన గాలికోసం.. ఎల్గీ నుంచి స్టెబిలైజర్ టెక్నాలజీ కంప్రెసర్లు

చాట్‌బాట్‌కు ఇచ్చిన ప్రాంప్ట్‌లు, బ్యాటరీ వినియోగం వంటి డేటా, యాప్ ల వాడకం, వేళ్ల కీస్ట్రోక్‌ల ద్వారా కస్టమర్ బీహేయిర్ ను ట్రాక్ చేస్తుందని ఈ విచారణలో తేలింది. డీప్ సీక్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.. దీప్ సీక్ పై చాలా డౌట్లు ఉన్నాయి. త్వరలో దీనిపై ప్రభుత్వం ఓ నోటీసు జారీ చేస్తుందని CERT-In  అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. 

డీప్‌సీక్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు

ఇటలీ, ఆస్ట్రేలియా వంటి దేశాలు, అమెరికా సమాఖ్య సంస్థలు ఇప్పటికే అధికారిక పరికరాల్లో డీప్‌సీక్ వాడకాన్ని నిషేధించాయి. గత నెలలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కూడా ఇంటర్నల్ నోటీస్ జారీ చేసింది. ఆఫీస్ కంప్యూటర్లు ,డివైజ్ లలో AI అప్లికేషన్లను ఉపయోగిస్తే.. సున్నితమైన ప్రభుత్వ సమాచార భద్రతకు ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించింది.