ఆరు ఎయిర్‌పోర్టులకు మూడు ఓకే చేసిన ఎయిర్అథారిటీ
స్టేట్‌కే నిర్ణయాన్ని వదిలేసిన కేంద్ర ప్రభుత్వం
పెద్దపల్లి, వెలుగు: రాష్ట్ర సర్కార్ కేంద్ర విమానయాన శాఖకు గత సంవత్సరం 6 ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రపోజల్స్పంపించింది. ప్రపోజల్స్పరిశీలించిన ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సర్వే నిర్వహించి గత డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను అందజేసింది. తొమ్మిది నెలలైనా ఇప్పటివరకు ఫీజిబిలిటీ రిపోర్టును తెలంగాణ ప్రభుత్వం ఫుల్‌ఫిల్ చేయలేదు. ఎలాంటి రెస్పాన్స్ఇవ్వలేదు. కేంద్ర విమానయాన శాఖ సైతం తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికే వదిలేసింది. తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఎయిర్ పోర్టుల ఏర్పాటు, విమాన రాకపోకల సాధ్యాసాధ్యాలు, వాటివల్ల కలిగే లాభనష్టాలను భారత విమానయాన సంస్థ బేరీజు వేసింది. మొత్తం ఆరింటిలో 3 మాత్రమే అన్ని రకాలుగా తగిన విధంగా ఉన్నాయని ఎయిర్ పోర్టు అథారిటీ తన నివేదికలో పేర్కొంది. వివిధ దఫాల్లో క్షేత్రస్థాయి సందర్శన చేసిన కేంద్ర బృందాలు వరంగల్ లోని మామూనూర్, ఆదిలాబాద్, నిజామాబాద్ లోని జక్రాన్ పల్లి మాత్రమే పూర్తిస్థాయి విమానాశ్రయాలకు అనుకూలంగా ఉన్నాయని నివేదించాయి. భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచ, మహబూబ్ నగర్‌లోని దేవరకద్ర, పెద్దపల్లిలోని బసంత్ నగర్లు ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు, పెద్ద విమాన రాకపోకలకు అంతగా అనుకూలంగా లేవని భారత విమానయాన సంస్థకు ఇచ్చిన రిపోర్టులో పేర్కొన్నాయి.
ఫీజిబిలిటీ రిపోర్టులో ఏముంది..
కేంద్ర వియానయానశాఖ రాష్ట్రాలకు అనుకూల ప్రదేశాల్లో ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించుకోవడానికి అవకాశం కల్పించింది. దాంట్లో భాగంగానే తెలంగాణ సర్కారు రాష్ట్రవ్యాప్తంగా 6 ఎయిర్‌పోర్టుల ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఈ క్రమంలో ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గత డిసెంబర్లో ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను స్టేట్గవర్నమెంటుకు పంపింది. దీని ప్రకారం రన్‌వే, ఐసోలేషన్బే, జీఎస్ఈ ఏరియా, పెరిమీటర్రోడ్, బౌండరీ వాల్, డ్రైన్స్, టెర్మినల్ బిల్డింగ్, ఫైర్‌స్టేషన్, ఏటీసీ టవర్, కార్‌పార్కింగ్, ఎలక్ట్రిక్సబ్స్టేషన్, ఫ్యూయల్డిపో, నావిగేషన్ఎయిడ్, జీఎల్ఎఫ్ లాంటి ఇతర సౌకర్యాలను కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం అంగీకరిస్తూ రిపోర్టును పంపాలి.
ఏర్పాటు బాధ్యత రాష్ట్రాలదే
డిజిన్వెస్ట్మెంటుతో కేంద్రం ఇప్పటికే కొన్ని ఎయిర్‌పోర్టులను ప్రైవేటుకు అప్పగించింది. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా కొత్త ఎయిర్‌పోర్టులను ఏర్పాటు చేసే ఆలోచనను కేంద్రం విరమించుకుంది. కొత్తగా ఎక్కడైనా ఏర్పాటు చేయాలనుకుంటే పూర్తి బాధ్యత ఆ రాష్ట్రాలే తీసుకోవాల్సి ఉంటుంది. ఎయిర్పోర్ట్సెక్యూరిటీ, కమ్యూనికేషన్లు మాత్రం కేంద్రం ఆధీనంలో ఉంటాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ఆప్షన్లను రాష్ట్రాలకు ఇచ్చింది. ఎయిర్‌పోర్టులను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం నడిపించుకోవడం, పూర్తిగా ప్రైవేటుకు అప్పగించడం, భాగస్వామ్యంతో అయినా నడిపించుకునే అవకాశం కల్పించింది. రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, పెద్దపల్లి, మహబూబ్‌నగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎయిర్‌పోర్ట్‌లు ఏర్పాటుకు చాలా రోజుల నుంచి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ ఆరు జిల్లాల్లో వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్జిల్లాల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు పరిసరాలు అనుకూలంగా ఉన్నట్లు సర్వే చేసిన ఎయిర్పోర్ట్ అథారిటీ గత డిసెంబర్లోనే ఆమోదం తెలిపింది. అయినా ఇప్పటివరకు స్టేట్ గవర్నమెంటు ఆయా జిల్లాల్లో ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు.
రాష్ట్ర సర్కారు రెస్పాండ్కాలే
ఎయిర్పోర్ట్ ఫీజిబిలిటీ రిపోర్టు పుల్ఫిల్చేయడంపై రాష్ట్ర సర్కారు స్పందించడం లేదు. స్టేట్ మొత్తం ఆరు ఎయిర్‌పోర్ట్‌లు నిర్మించడానికి చాలాకాలం కిందటే ప్రపోజల్స్వచ్చాయి. గత సంవత్సరం ఆరు ఎయిర్పోర్ట్ స్థలాలను సర్వే చేసి డిసెంబర్లో స్టేట్గవర్నమెంటుకు ఫీజిబిలిటీ రిపోర్ట్అందజేశాం. ఆరింట్లో ఇన్‌స్టంట్‌గా మూడు ఎయిర్‌పోర్ట్‌లను నిర్మించుకోవచ్చు. మిగతా మూడు ఫీజిబిలిటీకి అనుగుణంగా మార్చితే అక్కడ కూడా నిర్మాణ చేపట్టవచ్చు. కేంద్రం ఎయిర్పోర్ట్ నిర్మాణాల పూర్తి బాధ్యత రాష్ట్రాలకే ఇచ్చేసింది. ప్రభుత్వ ఆధీనంలోనా, లేక ప్రైవేటుకు అప్పగించుకోవడమా అనేది స్టేట్తేల్చుకోవాల్సి ఉంటుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన కన్పించడం లేదు.
– కాసం వెంకటేశ్వర్లు, డైరెక్టర్, ఎయిర్పోర్ట్ అథారిటీ