
ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీల్లో 3,220 ప్రొఫెసర్, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 బ్యాక్‌లాగ్, 2,942 రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు ప్రకటనలు విడుదల చేశాయి. వీటిలో ప్రొఫెసర్ పోస్టులు 418, అసోసియేట్ ప్రొఫెసర్లు 801, ట్రిపుల్‌ఐటీల లెక్చరర్ పోస్టులతో కలిపి సహాయ ఆచార్యుల పోస్టులు 2,001 ఉన్నాయి.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టులో పీజీ, ఎంఫిల్/ పీహెచ్‌డీ, యూజీసీ/ సీఎస్‌ఐఆర్ నెట్/ ఏపీ స్లెట్/ సెట్ ఉత్తీర్ణులై ఉండాలి.
సెలెక్షన్ ప్రాసెస్: స్క్రీనింగ్ టెస్టు, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
స్క్రీనింగ్ పరీక్ష: స్క్రీనింగ్ రాత పరీక్షను ఏపీపీఎస్సీ ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుంది. 3 గంటల సమయంలో మొత్తం 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఈ పరీక్షలో వచ్చిన మార్కులు, అకడమిక్ ప్రాధాన్యంగా ఇంటర్వ్యూకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తులు: అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో నవంబర్ 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.universities.ap.gov.in వెబ్సైట్లో సంప్రదించాలి.
అప్లికేషన్ ఫీజు: అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు ఓపెన్ కేటగిరీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.2,500; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.2 వేలు ఆన్‌లైన్‌లో దరఖాస్తుతో పాటు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.