రాష్ట్ర పాలనలో ఏఐ!

రాష్ట్ర పాలనలో ఏఐ!
  • అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం
  • గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థల సహకారం తీసుకోవాలనిసర్కారు నిర్ణయం
  • ఎక్కడెక్కడ వినియోగించాలనే దానిపై నివేదిక కోరిన సీఎస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వ పాలన, ప్రజాసేవల్లో ఆర్టిఫిషియల్‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ ( ఏఐ)ను  వినియోగించాలని ప్రభుత్వం భావిస్తున్నది. భవిష్యత్తు ఏఐదే కావడంతో ఆ దిశగా  అడుగులు వేస్తున్నది. గూగుల్, మైక్రోసాఫ్ట్​లాంటి వివిధ దిగ్గజ ఐటీ కంపెనీలతో ఏఐకి సంబంధించి ఒప్పందాలు చేసుకోవాలని నిర్ణయించింది.  టెక్నాలజీలో  ప్రభుత్వ శాఖలు వెనుకంజలో ఉండకుండా ముందస్తు ప్రయత్నాలు ప్రారంభించింది.

ప్రైవేట్​కు చెందిన ఏఐ యాప్​లు, ఇతర టూల్స్​ ప్రభుత్వ కంప్యూటర్​లలో వాడకుండా.. ప్రభుత్వ భాగస్వామ్యంతో రూపొందించిన వాటినే వినియోగించేలా ప్లాన్​ చేస్తున్నది. తొలుత కొన్ని శాఖల్లో పైలెట్​ ప్రాజెక్ట్​ కింద వినియోగించి.. తర్వాత ఆయా శాఖల్లో ఉన్న అవసరాలకు తగ్గట్టుగా అమలు చేయాలని చూస్తున్నది. ఇందుకోసం ఉద్యోగులకు సైతం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఇప్పటికే ఏఐ వినియోగం కోసం నోడల్​ ఆఫీసర్లను నియమించింది. ఏయే  ప్రభుత్వ శాఖలకు  ఏ తరహా యాప్‌‌‌‌‌‌‌‌లు అవసరమనే దానిపై సీఎస్​ రిపోర్ట్​ కోరినట్లు తెలిసింది. సెక్రటేరియేట్​తో పాటు ఆయా విభాగాల్లో జిల్లా, మండల స్థాయి వరకు ఏఐ టెక్నాలజీని వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. 

హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్​ టాప్  ప్రయారిటీ

హెల్త్, ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ట్రాన్స్​పోర్ట్​, ఫారెస్ట్​, పోలీసు శాఖల్లో ఆర్టిఫిషియల్​ ఇంటిలెజెన్స్​ విస్తృతంగా వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది. హెల్త్​కు సంబంధించి ఆరోగ్య శ్రీ, హెల్త్​ కార్డులు వంటివి ప్రభుత్వం అందిస్తున్నది. ఇందులో ప్రభుత్వ, ప్రైవేట్​ హాస్పిటల్స్​ అన్నీ ఉన్నాయి.  ఏఐను ప్రధానంగా రోగ నిర్ధారణ, ఆరోగ్య శ్రీ కింద  చేస్తున్న సర్జరీల రిఫరెన్స్​ల్లో వినియోగించాలని అనుకుంటున్నది.

ఇక ఇతర టెస్ట్​లకు వాడుకోవాలని, ఏఐ- ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్ తో క్యాన్సర్ వంటి రోగాలను ముందుగానే గుర్తించేలా అవకాశం ఉంటుందని భావిస్తున్నది. ఎడ్యుకేషన్​లో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో టీచింగ్ కోసం ఏఐను అందుబాటులోకి తీసుకురాబోతున్నది. భవిష్యత్తులో ప్రశ్నపత్రాల రూపకల్పన, సిలబస్​, ఆన్​లైన్​ ఎన్​రోల్​మెంట్ వంటివన్నీ ఏఐతో అనుసంధానం చేయాలని చూస్తున్నది.  వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి ఉన్నత పాఠశాలల్లో ఏఐ పాఠాలతోపాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చేందుకు ప్లాన్​ చేస్తున్నారు.

ఈ రంగంపై ఆసక్తిని పెంచేందుకు పాఠశాలల్లో ఏఐ టూల్స్‌‌‌‌‌‌‌‌, సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌పైనా ప్రాథమిక శిక్షణ ఇవ్వనున్నారు. పోలీసు  శాఖలో నేర నివారణ, నేరగాళ్లను గుర్తించడం, ట్రాఫిక్​ నియంత్రణ, కేసుల సత్వర పరిష్కారం వంటి వాటికోసం ఏఐని వినియోగించాలని భావిస్తున్నది. ఇప్పటికే  తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో ‘ది మిత్ర’పేరిట ఏఐ ఆధారిత యాప్‌‌‌‌‌‌‌‌ను రూపొందించింది.  పౌర సేవల కోసం  టీ -యాప్‌‌‌‌‌‌‌‌, ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ - రియల్‌‌‌‌‌‌‌‌ టైం డేటాతో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ నిర్వహణ, వ్యవసాయంలోనూ భూసార పరీక్షల ఆధారంగా వేయదగ్గ పంటలు, వాతావరణం ఆప్​డేట్స్ ​, కొత్త వంగడాలు, దిగుబడులు, పంట తెగుళ్ల నివారణకు ఏఐ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నది.