ఆదిలాబాద్టౌన్, వెలుగు : ఇది జిల్లాలోని కరెంటు డిపార్ట్మెంట్లోని ఓ పెద్దసారు కారు. దీనికి నంబరు కూడా వచ్చింది. కానీ ముందు భాగంలో కనబడకుండా, వెనుకభాగంలో నంబర్ ప్లేట్ పెట్టకుండా దర్జాగా తిరుగుతున్నారు. సామాన్యులకు చలానాలు వేసే పోలీసులు.. పెద్దాఫీసర్లను మాత్రం చూసి చూడకుండా వదిలేస్తున్నారు.
అధికారులకు, ప్రజలకు దిశానిర్దేశం చేసే ఉన్నతాధికారులే నిబంధనలు పాటించకుండా ఇలా వ్యవహరిస్తే.. వారు ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.