మణిపూర్ సంఘటనపై కేంద్రం సీరియస్ గా తీసుకుంది. ఇద్దరు మణిపూర్ మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన వైరల్ వీడియోను షేర్ చేయవద్దని ట్విట్టర్‌తో సహా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను ఆదేశించింది. ఈ ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. భారతీయ చట్టాలకు కట్టుబడి ఉండటం తప్పనిసరి అని ప్రభుత్వం నొక్కి చెప్పింది.మ రోవైపు ఈఘటనపై మణిపూర్ పోలీసులు స్పందించారు. మహిళల కిడ్నాప్, సామూహిక అత్యాచారం, హత్య కేసును నమోదు చేశామని తౌబాల్ ఎస్పీ మేఘచంద్ర సింగ్ తెలిపారు. రాష్ట్ర పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ఈ దారుణానికి పాల్పడిన నిందితులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. వీడియో సర్క్యులేషన్‌తో మణిపూర్‌లోని కొండల్లో ఉద్రిక్తత నెలకొంది.
మణిపూర్ లో ఇద్దరు మహిళలను నగ్నం ఊరేగించటం.. పొలాల్లో అత్యాచారానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎలాంటి సోషల్ ఫ్లాట్ ఫామ్స్ లో వినియోగించొద్దని.. షేర్ చేయొద్దని.. ఎవరికీ పంపించొద్దని.. వాట్సాప్ గ్రూప్స్ లో షేర్ చేయొద్దని ఆదేశించింది కేంద్ర హోంశాఖ. ఎవరైనా మణిపూర్ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు షేర్ చేసినట్లయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని.. అలాంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలను బ్యాన్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది కేంద్ర హోంశాఖ. వ్యక్తిగతంగా.. సంస్థ పరంగా.. మీడియా పరంగా అన్నింటికీ ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది కేంద్రం. ఈ అంశం చాలా సున్నితమైనదని.. భావోద్వేగాలకు సంబంధించిన అంశమని.. అందరూ సంయమనం పాటించాలని సూచించింది. సోషల్ మీడియాలో ఎవరూ వీటిని షేర్ చేయొద్దని గట్టిగా హెచ్చరించింది కేంద్ర హోం శాఖ.
ఈ ఘటనను ఆదివాసీ గిరిజన నాయకుల ఫోరమ్ (ITLF) తీవ్రంగా ఖండించింది. మే 4న ఈ ఘటన చోటుచేసుకోగా.. బుధవారం ఈ వీడియో వైరల్ అయ్యింది. వీడియోలో కనిపించిన మహిళల చుట్టూ కొందరు పురుషులున్నారు. వారంతా కలిసి సమీపంలోని పొలంలో బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఆదివాసీ గిరిజన నాయకులు ఫోరమ్ ఆరోపించింది.
*All out effort to arrest culprits as regard to the viral video of 02 (two) women paraded naked :*
— Manipur Police (@manipur_police) July 19, 2023
As regard to the viral video of 02 (two) women paraded naked by unknown armed miscreants on 4th May, 2023, a case of abduction, gangrape and murder etc
1/2