హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటేషన్లు రద్దు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటేషన్లు రద్దు... ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న 242 మంది తెలం గాణ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఉద్యోగులు, అధికారుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఏ శాఖలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల లిస్ట్ ను గురువారం ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా గురువారం జీవో జారీ చేశారు.

వీరిని వెంటనే కార్పొరేషన్ కు రిలీవ్ చేయాలని హౌసింగ్ ఎండీ అయా శాఖలు, కార్పొరేషన్లకు త్వరలో లేఖ రాయనున్నారు. ఇటీవల హౌసింగ్ డిపార్ట్ మెంట్ పై సీఎం రివ్యూ చేయగా ఈ అంశాన్ని అధికారులు ప్రస్తావించారు. గతేడాది డిసెంబర్ నుంచి హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగులను రిలీవ్ చేయాలని ఆ శాఖ ఉద్యోగ సంఘాలు పలు సార్లు ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కోరుతున్నారు.