- ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఆయా జిల్లాల్లో 32 మండల ప్రజా పరిషత్ లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
వీటి నిర్వహణకు కావాల్సిన భవనాలను గుర్తించాలని ఆయా జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నారాయణపేట, నిజామాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలో కొత్తగా ఏర్పాటైన 32 మండల ప్రజా పరిషత్లు ఉన్నాయి.