లొడాసు లాగులు బిర్రు అంగీలు .. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో క్లాత్​ వేస్ట్ 

లొడాసు లాగులు బిర్రు అంగీలు .. ఆఫీసర్ల పర్యవేక్షణ లోపంతో క్లాత్​ వేస్ట్ 
  • స్కూల్​ పిల్లల ఫస్ట్​ఫేజ్​యూనిఫామ్స్ పరిస్థితి ఇలా..
  • సివిల్ డ్రెస్​లతో బడులకు వస్తున్న స్టూడెంట్స్​
  • రెండో జత పట్ల అలర్ట్​ అయితేనే నష్ట నివారణ  

అధికారుల పర్యవేక్షణ లోపంతో సర్కారు బడి పిల్లల యూనిఫామ్స్​ లూజ్​గా లేదంటే టైట్​గా మారాయి. ఇప్పటికే స్కూళ్లకు చేరిన మొదటి జత యూనిఫామ్ పరిస్థితి ఇలా ఉండగా, అధికారులు కళ్లు తెరకుంటే రెండో జత యూనిఫామ్స్​ పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది.  

నిజామాబాద్​, వెలుగు: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 693 ప్రైమరీ, 115 అప్పర్​ ప్రైమరీ, 230 స్కూల్స్​, 25 కేజీబీవీలు, 10 ఆదర్శ కలిపి మొత్తం 1,074 సర్కారు బడులు ఉన్నాయి. ఇందులో చదివే 1 నుంచి 12 తరగతుల స్టూడెంట్స్​కు రెండు జతల యూనిఫామ్స్​ను​సర్కారు ఫ్రీగా అందజేస్తుంది. మహిళా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టి చేయడానికి కాంగ్రెస్ గవర్నమెంట్​ఈసారి యూనిఫామ్స్​ కుట్టే బాధ్యతను వారికే అప్పగించింది. 60,355 మంది బాయ్స్​, 51,906​ గర్ల్​ స్టూడెంట్లకు యూనిఫామ్స్​అందివ్వడానికి మొత్తం 10.17 లక్షల మీటర్ల క్లాత్​ కొనుగోలు చేశారు. యూనిఫామ్స్​ రెడీ చేసే టైంలో సైజ్​ల విషయంలో ఆఫీసర్లు సరిగ్గా మానిటరింగ్​ చేయకపోవడం లోపమైంది.

ఒక్కోటి ఒక్కోలా ఉండడంతో..

ఒకటో క్లాస్​ నుంచి 3 క్లాస్​ స్టూడెంట్స్​కు ఒకే సైజ్​యూనిఫామ్స్​ రెడీ చేసి పంపారు. వీటిలో నెక్కర్​పొట్టిగా లేకుంటే లూజ్​గా, షర్ట్​ బిర్రుగా వచ్చాయి. 4 నుంచి 7  క్లాస్​ల దాకా నెక్కర్లు, షర్ట్​లను కేవలం రెండు రకాల సైజులతో కుట్టారు. 8- నుంచి 10 బాయ్స్​కు ప్యాంట్, షర్ట్​లు ఇష్టమైన సైజులతో స్కూల్స్​కు చేరాయి.  వీటిని వేసుకుంటే ఒక్కోటి ఒక్కోలా ఉండడంతో స్టూడెంట్స్​ పక్కన పెట్టేశారు. మొదట్లో విషయం అర్థంకాని పేరెంట్స్​ సైజులు మార్చుకోడానికి బడులకు వచ్చి టీచర్లను ప్రశ్నించగా, ఉన్న సంగతి చెప్పారు. 

బాలికల పరిస్థితి అంతే.. 

ఇక 1–-3 క్లాస్​ బాలికలకు ఫ్రాకులు, 4-–5 తరగతి అమ్మాయిల స్కర్ట్స్​, 6-–12 వరకు చుడీదార్​ యూనిఫామ్స్​ అందించారు. సైజు సరిపోక అమ్మాయిలు కూడా వీటిని ధరించడం లేదు. ఫలితంగా 80 శాతం స్టూడెంట్స్​ సివిల్​ డ్రెస్​లోనే బడులకు వస్తున్నారు. మరో మూడు వారాల్లో రెండో జత యూనిఫారాలు రెడీ చేసే టార్గెట్​ మహిళా సంఘాలపై పెట్టారు. లోపాలు సెట్​ చేయకుంటే మళ్లీ సమస్య రిపీట్​ అయ్యే ప్రమాదముంది. కుట్టు చార్జ్​ను కూడా గవర్నమెంట్​ పెంచి జతకు రూ.75 అందిస్తున్నందున ఆఫీసర్లు సమర్ధ అజమాయిషీ చేయాలి.

ఈ నెలాఖరుకు రెడీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నం

ఫస్ట్​ ఫేజ్​లో అందించిన ఒక  జత యూనిఫామ్స్​ కుట్టడంలో  సమస్యలు వచ్చాయి. ఇప్పుడు వాటన్నింటినీ సరిచేశాం.  బాయ్స్​ డ్రెస్​లు కుట్టడంలో మహిళలకు ట్రైనింగ్​ఇచ్చాం. రెండో జత పర్​ఫెక్ట్​గా సప్లై చేస్తం. ఆగస్టు 15 వరకు గడువున్నా ఈనెలాఖరు నాటికి విలేజ్​స్టూడెంట్స్​కు వీటిని అందించే టార్గెట్​ పెట్టుకున్నం. అర్బన్​యూనిఫారాల స్టిచ్చింగ్​ మెప్మా చూస్తోంది. 

సాయిలు, డీపీఎం, ఐకేపీ