
- మోకిల ప్లాట్ల ప్రీ బిడ్డింగ్ మీటింగ్ సక్సెస్
- 23 నుంచి 300 ప్లాట్లకు వేలం
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మోకిలలో ఫేజ్ 2 వేలానికి సర్కారు సిద్ధమైంది. అక్కడున్న 300 ప్లాట్లకు హెచ్ఎండీఏ ఈ నెల 23 నుంచి ఆన్ లైన్లో వేలం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించి గురువారం మోకిలలో ప్రీ బిడ్డింగ్ మీటింగ్ జరిగింది. ఈ మీటింగుకు అనూహ్య స్పందన వచ్చింది. దాదాపు 165 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఎండీఏ 1,321 ప్లాట్లలతో కూడిన భారీ రెసిడెన్షియల్ లేఅవుట్ ను రూపొందించింది.
ప్రీ బిడ్ సమావేశంలో ముందుగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(ఎంఎస్టీసీ) ప్రతినిధి అనురాగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. వేలం ప్రక్రియ పద్ధతులను వివరించారు. కార్యక్రమంలో హెచ్ఎండీఏ అధికారులు పాల్గొన్నారు. సిటీ శివారుల్లో డెవలప్ చేసిన ప్లాట్లను రాష్ట్ర సర్కారు ఒక్కొక్కటిగా వేలం వేస్తూ వస్తోంది. కోకాపేట్, బుద్వేల్, మోకిల, షాబాద్ ప్లాట్ల వేలంతో కోట్లాది రూపాయల ఆదాయం వచ్చి చేరింది. అదే జోష్ తో మోకిలలో ఫేజ్-2 వేలానికి ప్రీ బిడ్డింగ్ మీటింగ్ నిర్వహించింది.