జయరాజ్​కు ప్రభుత్వ గుర్తింపు సింగరేణికి గర్వకారణం : సీఎండీ బలరామ్

జయరాజ్​కు ప్రభుత్వ గుర్తింపు సింగరేణికి గర్వకారణం : సీఎండీ బలరామ్
  • సీఎండీ బలరామ్

హైదరాబాద్, వెలుగు:  సింగరేణి ఉద్యోగి, కవి జయరాజుకు  ప్రభుత్వ గుర్తింపు ఇస్తూ తామ్రపత్రం, నగదు పురస్కారం ప్రకటించడం సంస్థకు గర్వకారణమని సీఎండీ ​బలరామ్​  అన్నారు. మంగళవారం సింగరేణి భవన్​లో జయరాజ్​ను ఆయన సన్మానించారు.

ఈ సందర్భంగా జయరాజ్​ కవిగా  ప్రజా చైతన్య ఉద్యమాల్లో ముఖ్య పాత్ర పోషించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణకు, అక్షరాస్యత పెంపునకు తన రచనల ద్వారా ఎంతో కృషి చేశాస్తున్నారని బలరామ్ ప్రశంసించారు. జయ రాజ్ మాట్లాడుతూ.. సింగరేణి అందించిన సహకారం, ప్రోత్సాహం వల్లే తాను కవిగా, ఉద్యమ కారుడిగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగానని అన్నారు.