34 కార్పొరేషన్లకు చైర్​పర్సన్లు.. లిస్ట్ ​రిలీజ్ ​చేసిన ప్రభుత్వం

34 కార్పొరేషన్లకు చైర్​పర్సన్లు.. లిస్ట్ ​రిలీజ్ ​చేసిన ప్రభుత్వం
  • మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్​కువైస్ చైర్మన్ నియామకం
  • రెండేండ్ల పదవీకాలంతో జీవో విడుదల
  • పాత జాబితాలో స్వల్ప మార్పులు
  • టికెట్లు త్యాగం చేసిన వారికి,ఎన్నికల్లో కష్టపడ్డ వారికి ప్రాధాన్యం
  • త్వరలో మరిన్ని నామినేటెడ్​ పోస్టుల భర్తీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 34 కార్పొరేషన్లకు చైర్​పర్సన్లను  నియమించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకుల నాలుగు నెలల నిరీక్షణకు తెరపడింది. అసెంబ్లీ, లోక్​సభ్​ ఎన్నికల్లో టికెట్లు త్యాగం చేసిన వారికి, ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం  కష్టపడ్డవారికి ఈ పదవులు దక్కాయి.

మార్చి 15 తేదీన రెడీ చేసిన లిస్టునే స్వల్ప మార్పులతో ఇప్పుడు విడుదల చేశారు. కొత్తగా నియామకమైన చైర్మన్లు రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. త్వరలో మరిన్ని కార్పొరేషన్లకు కూడా చైర్మన్లను నియమించనున్నట్టు తెలిసింది.మంత్రి పదవి ఆశిస్తున్న ఎమ్మెల్యేలకు, సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఈ పదవులు ఇచ్చే ఆలోచనతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలిసింది. అందుకే వాటిని తాత్కాలికంగా వాయిదా వేసినట్టు సమాచారం.

లిస్టులో లేని నేరెళ్ల శారద పేరు

మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన నేరెళ్ల శారదను మొదటి జాబితాలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. అయితే, ప్రస్తుత జాబితాలో ఆమె పేరు లేదు. ఇది కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. అయితే, మహిళా కమిషన్ చైర్ పర్సన్ రాజ్యాంగబద్ధ పదవి కావడంతో గవర్నర్ పేరుతో ఒకటి, రెండు రోజుల్లో ఆమెకు ఆర్డర్స్ రానున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

పలువురు బాధ్యతల స్వీకరణ

సోమవారం ఉదయం వివిధ కార్పొరేషన్లకు చైర్మన్లను నియమిస్తూ ప్రభుత్వ నుంచి జీవో విడుదల కాగానే సాయంత్రం వరకే పలు కార్పొరేషన్ల చైర్మన్ లు సంబంధిత కార్యాలయాల్లో బాధ్యతలు స్వీకరించారు. వీరిలో మెట్టు సాయి కుమార్, మల్ రెడ్డి రాంరెడ్డి, ఎంఏ ఫహీమ్, అన్వేష్​ రెడ్డి ఉన్నారు.

పీసీసీ కిసాన్ ​సెల్​రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన అన్వేష్ రెడ్డిని తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్​గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో సోమవారం హాకా భవన్​లో ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి కిసాన్ ​సెల్ నేషనల్​ వైస్ ​ చైర్మన్​ కోదండరెడ్డి తదితరులు హాజరై అన్వేష్​రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

ప్రభుత్వం నియమించిన కార్పొరేషన్ల చైర్మన్లు వీరే..

1. ఎస్. అన్వేష్ రెడ్డి, తెలంగాణ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
2. బాలరాజు కాసుల , తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి
3. జంగా రాఘవరెడ్డి, కార్పొరేషన్ లిమిటెడ్ తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ ఆయిల్ సీడ్స్, గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్
4. మానాల మోహన్ రెడ్డి, తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్
5. రాయల నాగేశ్వరరావు, తెలంగాణ స్టేట్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్
6. జ్ఞానేశ్వర్ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కో-ఆపరేటివ్ సొసైటీస్ కార్పొరేషన్ లిమిటెడ్
7. మెట్టు సాయి కుమార్, తెలంగాణ స్టేట్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్ లిమిటెడ్
8. ఎండీ. రియాజ్, తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్
9. పొదెం వీరయ్య ( మాజీ ఎమ్మెల్యే ), తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ
10. కాలువ సుజాత, తెలంగాణ రాష్ట్ర ఆర్య వైశ్య కార్పొరేషన్
11. ఆర్. గురునాథ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ పోలీస్ హౌసింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
12. ఎన్.గిరిధర్ రెడ్డి, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ ప్రమోషన్,  ట్రైనింగ్ ఇన్ ట్విన్ సిటీస్ (సెట్విన్)
13. జనక్ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి
14. ఎం. విజయ బాబు, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ లిమిటెడ్
15. నాయుడు సత్యనారాయణ, తెలంగాణ రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ లిమిటెడ్
16. అనిల్ ఈరవత్రి, తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
17. టి. నిర్మలా జగ్గారెడ్డి, తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్
18. అయితా ప్రకాశ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కార్పొరేషన్
19. మన్నె సతీష్ కుమార్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
20. చల్లా నరసింహా రెడ్డి, తెలంగాణ రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కో-ఆపరేషన్ లిమిటెడ్
21. కె. నరేందర్ రెడ్డి, శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( కరీంనగర్ )
22. ఇ.వెంకట్రామి రెడ్డి, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ( వరంగల్ )
23. రాంరెడ్డి మల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర రోడ్డు అభివృద్ధి సంస్థ
24. పటేల్ రమేశ్ రెడ్డి, తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
25. ఎంఏ ఫహీం, తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్
26. బండ్రు శోభారాణి, తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార సంస్థ
27. ఎం. వీరయ్య, తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
28. కె. శివసేనా రెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్
29. అలేఖ్య పుంజల, తెలంగాణ సంగీత నాటక అకాడమీ
30. ఎన్. ప్రీతమ్, తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
31. నూతి శ్రీకాంత్, తెలంగాణ రాష్ట్ర బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ 
32. బెల్లయ్య నాయక్, తెలంగాణ స్టేట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
33. కొట్నాక తిరుపతి, తెలంగాణ రాష్ట్ర గిరిజన కో-ఆపరేటివ్ ఫైనాన్స్ అభివృద్ధి సంస్థ
34. జెరిపేట జైపాల్, తెలంగాణ స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్
35. ఏంఏ.జబ్బార్, తెలంగాణ స్టేట్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వైస్ చైర్మన్