సర్కార్ శాలరీస్​ ఈ నెల వారం లేట్

సర్కార్ శాలరీస్​ ఈ నెల వారం లేట్

ఫస్ట్ కు రావాల్సినవి వారం రోజులు ఆలస్యం

హైదరాబాద్, వెలుగు: సర్కార్​ ఉద్యోగులకు సెప్టెంబర్ నెల జీతాలు లేట్​గా జమ అవుతున్నాయి. ఫస్ట్ తారీఖు రావాల్సిన వేతనాలు వారం రోజులు ఆలస్యంగా అకౌంట్లలో పడుతున్నాయి. పైకి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అని చెబుతున్నప్పటికీ.. ఖజానా ఖాళీ కావడమే అసలు కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా తొలినాళ్లలో రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గిపోవడంతో మూడు నెలలు జీతంలో కోత విధించిన విషయం తెలిసిందే. కిందటేడాదితో పోలిస్తే ట్యాక్స్, నాన్​ట్యాక్స్ రెవెన్యూ​ బాగా తగ్గింది. అందుకే జీతమివ్వడం లేట్​ చేస్తున్నారని తెలిసింది. ఈ నెల జీతం హైదరాబాద్​ జిల్లాకు చెందిన కొందరికే ఫస్ట్​ తారీఖున పడగా, మిగతా వారికి రోజుకు కొన్ని జిల్లాల చొప్పున ఇప్పటికీ జమ అవుతున్నాయి. 10వ తేదీ వరకు జీతాలు పడడం కొనసాగుతుందని ట్రెజరీ ఆఫీసర్ ఒకరు వెల్లడించారు. ఫస్ట్​కు జీతం వస్తుందనే నమ్మకంతో చాలా మంది తమ ఇల్లు, కారు, ఇతర లోన్లను 5వ తేదీలోగా కట్ అయ్యేలా ఈఎంఐ పెట్టకున్నామని, కానీ ఆ తేదీ నాటికి జీతం పడకపోవడంతో ఫైన్ చెల్లించే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ జీతాలు ఇంకిత లేట్​

సర్కార్ ఉద్యోగులకు 10వ తేదీలోపు జీతాలిస్తుండగా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బంది పరిస్థితి మరింత దయనీయంగా మారింది. వీళ్లకు 15 నుంచి 20 రోజులు లేట్​గా జీతాలిస్తున్నారు. దీంతో 2 లక్షల మంది ఉద్యోగులకు ప్రతి నెలా ఇబ్బందులు తప్పడం లేదు. ఆదిలాబాద్, మంచిర్యాల, నాగర్ కర్నూలు, యాదాద్రి భువనగిరి, మహబూబ్ నగర్, మహబూబాబాద్ తదితర జిల్లాల్లోని టీచర్లకు సెప్టెంబర్ నెల వేతనాలు ఇంకా అందలేదు. జీపీఎఫ్​ సొమ్ము నుంచి సాంక్షన్ చేయించుకున్న లోన్లు, పాక్షిక ఉపసంహరణలు, రిటైర్డ్ అయిన, మరణించిన ఉద్యోగుల తుది వేతనాలూ పొందేందుకూ నెలల తరబడి ఎదురుచూడాల్సి వస్తోందని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

For More News..

సిటీలో 1,13,824 రాంగ్ అండ్ ఫేక్ నంబర్‌‌ ప్లేట్స్

ఛేజింగ్‌‌లో చేతులెత్తేసిన ధోనీసేన.. కేకేఆర్ చేతిలో ఓటమి