న్యూఢిల్లీ: గత ఐదేళ్లలో 339 ఫారిన్ కంపెనీలు ఇండియాలో రిజిస్టర్ చేసుకున్నాయని కార్పొరేట్ అఫైర్స్ సహాయ మంత్రి హర్ష మల్హోత్రా రాజ్యసభలో పేర్కొన్నారు. ఈ ఏడాది మూడు ఫారిన్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, కేరళలలో ఒక్కోటి చొప్పున రిజిస్టర్ చేసుకోగా, తమిళనాడులో రెండు ఫారిన్ కంపెనీలు రిజిస్టర్ చేసుకున్నాయని వివరించారు. గత ఐదేళ్లుగా ఫారిన్ కంపెనీల రిజిస్ట్రేషన్లు తగ్గుతూ వస్తున్నాయి. 2020లో 90 విదేశీ కంపెనీలు ఇండియాలో రిజిస్టర్ చేసుకోగా, 2021 లో ఈ నెంబర్ 71 కి తగ్గింది. 2022 లో 64 కి, 2023 లో 57 కి, 2024 లో 53 కి పడింది.
రిజిస్టరైన కంపెనీలు 1,38,027
కిందటేడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది జనవరి 26 వరకు మొత్తం 1,38,027 కంపెనీలు రిజిస్టర్ అయ్యాయని హర్ష మల్హోత్రా రాజ్యసభలో పేర్కొన్నారు. ఇదే టైమ్‌లో సుమారు 17,654 కంపెనీలు మూతపడ్డాయని తెలిపారు. 2023–24 లో 22,044 కంపెనీలు మూతపడగా, 2022–23 లో 84,801 కంపెనీలు క్లోజయ్యాయి.