అద్దె కట్టలేదని ప్రభుత్వ బడికి తాళం

  •     డబ్బాలో రోడ్డెక్కిన స్టూడెంట్లు, తల్లిదండ్రులు

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం డబ్బా గ్రామంలోని ప్రభుత్వ బడి ప్రైవేట్ బిల్డింగ్​లో నడుస్తోంది. 7 నెలలుగా అద్దె కట్టడం లేదని బిల్డింగ్​యజమాని గురువారం స్కూలుకు తాళం వేశాడు. టీచర్ మౌనిక రావడం లేట్​అవడంతో స్టూడెంట్లంతా బయటే కూర్చున్నారు. 

విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, గ్రామస్తులు అక్కడికి చేరుకుని రోడ్డుపై బైఠాయించారు. దాదాపు గంటన్నరపాటు ఆందోళన చేశారు. ఎస్సై సురేశ్, హెచ్ఎం జయరాజ్ వచ్చి వారం రోజుల్లో కిరాయి క్లియర్​చేసేలా చూస్తామని చెప్పారు. దీంతో ఆందోళన విరమించారు. కాగా ఉదయం 11 గంటలకు టీచర్​మౌనిక స్కూలుకు రావడం గమనార్హం.