ప్రభుత్వ హాస్పిటల్స్, సర్కారు బడులను.. ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దడంపై రేవంత్ సర్కార్ ఫోకస్

ప్రభుత్వ హాస్పిటల్స్, సర్కారు బడులను.. ప్రైవేట్కు దీటుగా తీర్చిదిద్దడంపై రేవంత్ సర్కార్ ఫోకస్
  • హాస్పిటల్స్ ఓపీ, ఐపీ ..విధానంలోనూ మార్పులు 
  • జీరో బిల్లులు అమలు చేసేలా ప్లాన్ 
  • ఔఅధికారుల నుంచి ప్రతిపాదనలు కోరిన ప్రభుత్వం 

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ హాస్పిటల్స్, సర్కారు బడులను ప్రైవేట్ కు దీటుగా తీర్చిదిద్దడంపై రాష్ట్ర సర్కారు దృష్టి సారించింది. కార్పొరేట్ తరహా సేవలను అందించడంతోపాటు అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు మొదలెట్టింది. ఇందులో భాగంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రపోజల్స్ సిద్ధం చేసి ఇవ్వాలని ఆయా శాఖలను ఆదేశించింది. దీంతో ప్రైవేటు, ప్రభుత్వానికి ఎక్కడెక్కడ గ్యాప్ ఉంటున్నది ? ఏ రకంగా ముందుకెళ్తే పరిస్థి తుల్లో మార్పు వచ్చి, ప్రభుత్వ హాస్పిటల్స్, స్కూళ్లపై మరింత నమ్మకం పెరుగుతుందనే దానిపై అధికా రులు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ హాస్పిటల్స్, స్కూల్స్ ను ప్రభుత్వం ఆకర్షణీ యంగా తీర్చిదిద్దనుంది. ప్రస్తుతం ఉన్న విధానాలను మార్చాలని చూస్తున్నది. వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రీ ప్రైమరీ స్కూల్స్ ను అందుబాటులోకి తీసు కురావాలని భావిస్తున్నది. 

ప్రైవేట్ స్కూల్స్ గా ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ బోర్డ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, లైబ్రరీలు, శు భ్రమైన టాయిలెట్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, పేరేంట్స్ మీట్ వంటివి ఏర్పాటు చేసేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. అటు పాఠశాలలు, ఇటు హాస్పిటల్స్​ లో అందుబాటులోకి తీసుకురావాలని అనుకుంటున్న కార్పొరేట్ సేవలకు సీఎస్ఆర్ ఫండ్స్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రత్యేకంగా ఖర్చు చేయాలని చూస్తున్నది. 

హాస్పిటల్స్​ కు  రంగులు.. ఓపీ ఆన్ లైన్​ 

ప్రస్తుతం ప్రభుత్వ హాస్పిటల్స్​ లో  పరిశుభ్రత ప్రధాన లోపంగా ఉన్నది. పైగా డాక్టర్లు తక్షణమే స్పందించే పరిస్థితులు లేవనే విమర్శలున్నాయి. దీంతో పరిశు భ్రదతను మెయిన్​ టెయిన్ చేయడమే కాకుండా.. ప్రతి ప్రభుత్వ హాస్పిటల్స్ కు ప్రత్యేక రంగులు వేసి.. ఏయే విభాగం ఎక్కడ ఉందో అక్కడ ప్రైవేట్ హాస్పిటల్స్ మాదిరి ఏర్పాట్లు చేయాలని సర్కారు భావిస్తున్నది. 

హాస్పిటల్స్​  శుభ్రంగా ఉంచేందుకు కొత్త పద్ధతులు తీసుకురానుంది. ఇక ఓపీ, ఐపీలో మార్పులు తీసుకురావాలని చూస్తున్నది. ప్రస్తుతం కొన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ రోగులకు ఆన్​ లైన్ ఎంట్రీతో, మరికొన్నింటిలో చేతిరాతతో ఓపీ స్లిప్ రాసి ఇస్తు న్నారు. తర్వాత వారు సంబంధిత డాక్టర్ దగ్గరకు వెళ్తున్నారు. అక్కడ ఎక్కువ సేపు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంటున్నది. మళ్లీ అదే ఓపీ స్లిప్​ పై డాక్టర్ మందులు రాసి ఇస్తున్నారు. ఇప్పుడు ఈ విధానాన్ని ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రైవేట్ హాస్పిటల్స్ తరహాలో నేరుగా ఆన్​ లైన్​లోనే ఓపీ స్లిప్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నది. ఆతర్వాత డాక్టర్ దగ్గర ఎక్కువ టైం వేచి ఉండకుండా టోకెన్ సిస్టమ్ ను, రోగులు కూర్చునేందుకు ప్రత్యేకంగా కుర్చీలు ఏర్పాటు చేయాలని అనుకుంటున్నది. 

డాక్టర్​ కు  ఆన్​ లైన్​ లో  ఓపీ వివరాలు వెళ్లిన తర్వాత.. టెస్టులు, మందుల వివరాలు కూడా ఆన్​ లైన్​ లోనే ఎంట్రీ చేసి ప్రభుత్వ హాస్పిటల్ పేరుతో ఎ 4 సైజు పేపర్ లో ప్రింట్ చేసి, ఓపీ ఫైల్ ఇవ్వాలనుకుంటున్నది. దీంతోపాటు ఎక్స్ రే, సిటీ స్కాన్ వంటి టెస్ట్స్​ రిపోర్ట్స్ ను కూడా ఫైల్ రూపంలో ఇవ్వనుంది. ఏ టెస్టులు అయినా సరే కంప్యూటర్ ఆధారిత ప్రింట్​ తోనే ఫైల్ చేసి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నది. ఇందులో చాలావరకు ఉచితంగా చేస్తున్నప్పటికీ.. ఏ సర్వీసుకు ఎంత 
అవుతుందనే రేట్లు కూడా ముద్రించి చివరకు జీరో బిల్లు ఇవ్వడం, ఏదైనా అమౌంట్ కట్టాల్సింది ఉంటే దానిని ఇవ్వాలని చూస్తున్నది.

 ఇక ప్రధానంగా ప్రతి ఐసీయూ విభాగంలో సంబంధిత స్పెషలిస్ట్ డాక్టర్ ను 24/7 అందుబాటులో ఉంచేలా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఉదయం, సాయంత్రం రౌండ్లు మాత్రమే కాకుండా ఐసీయూలో ఎప్పుడు ఏ పేషెంట్​ కు  ఏం అవసరం ఉన్నా స్పెషలిస్టు డాక్టర్ దగ్గరుండి పర్యవేక్షించేలా ప్లాన్ చేస్తున్నారు. రోగులకు సౌకర్యవంతమైన గదులు. పేషెంట్ అటెండెంన్స్​కు  ప్రత్యేక హాల్స్ అందుబాటులో ఉంచాలని సర్కారు భావిస్తున్నది. ఇందుకోసం సీఎస్ఆర్ నిధులను వాడుకోవాలని ప్రాథమిక నిర్ణ యానికి వచ్చినట్టు తెలుస్తున్నది. 

ఫ్రీ ప్రైమరీతో స్టూడెంట్స్ ను ఆకట్టుకునేలా.. 

ప్రస్తుత జనరేషన్​ లో  తల్లిదండ్రులు నర్సరీ, ఎల్​ కేజీ, యూకేజీ ప్లే స్కూల్స్ అంటూ అడ్వర్టైజ్ చేసుకుం టున్న ప్రైవేట్ స్కూల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో స్టూడెంట్స్​ , వారి పేరెంట్స్​ను  ఆకట్టుకునే లా ప్రభుత్వ స్కూళ్లలోనే ఫ్రీ ప్రైమరీ విధానం తీసుకు రావాలని సర్కారు భావిస్తున్నది. మూడేండ్ల తర్వాత పిల్లలను నేరుగా ప్రభుత్వపీ ప్రైమరీఅంటే సర్సరీలో జాయిన్ చేసుకునే విధానం ఉంటే.. ముందునుంచి పదో తరగతి వరకు విద్యార్థులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందని అనుకుంటున్నది. అయితే ప్రైవేట్ మాదిరిగా వినూత్నంగా వీటిని తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నది.

 ఇక ప్రభుత్వ స్కూళ్లలో చాలాచోట్ల తరగతి గదులు, టాయిలెట్లు, కుర్చీలు, టేబుళ్లు పా తబడిపోయాయి. డిజిటల్ బోర్డులు, కంప్యూటర్లు లేకపోవడంతో విద్య ఆధునికంగా ఉండడం లేదు. ప్రభుత్వం ఉచిత యూనిఫామ్స్ ఇస్తున్నా.. అవి స్టూ డెంట్​ కు  సరిగ్గా సరిపోవడం లేదు

ప్రభుత్వ పాఠశాలల్లోనూ డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్​ లు 

ప్రైవేట్ స్కూల్స్ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో నూ డిజిటల్ బోర్డులు, కంప్యూటర్ ల్యాబ్లు, లైబ్రరీలు, ప్లే గ్రౌండ్స్, క్లీన్ టాయిలెట్స్ ఉండేలా చూడాలని ప్రభుత్వం భావిస్తున్నది. గేమ్స్, డ్యాన్స్, మ్యూజిక్, డ్రాయింగ్ వంటి అదనపు కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటున్నది. పిల్లల గురించి తల్లిదండ్రులతో ఎప్పుడూ మాట్లాడేలా పేరేంట్స్ మీట్, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ వంటివి అమలు చేయాలని సర్కారు ప్లాన్ చేస్తున్నది