
- డీఈవో శ్రీనివాస్‌రెడ్డి
చేర్యాల, వెలుగు: సర్కారు బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని, అనుభవం కలిగిన టీచర్లు ఉంటారని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని కడవేర్గు, నాగపురి, పెద్దరాజుపేట, పోతిరెడ్డి పల్లి గ్రామాల్లో బడిబాట ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూళ్లలో చదువుతున్న స్టూడెంట్స్ ఇండ్లకు వెళ్లి కష్టపడి సంపాదిస్తున్న డబ్బును దుబారా చేయొద్దని తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లలను సర్కారు బడుల్లో చేర్పించాలని కోరారు.
ప్రభుత్వ స్కూళ్లలో ఉచిత సౌకర్యాలతో పాటు టెక్నాలజీతో బోధన కల్పిస్తున్నామని తెలిపారు. తల్లిదండ్రులందరూ ప్రభుత్వ స్కూళ్లలోనే పిల్లలను చేర్పించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈవో కిష్టయ్య, టీచర్లు చంద్రశేఖర్‌రావు, కాంతికృష్ణ, అయిలయ్య, సంతోష్, మల్లికార్జున్, రాజు, బాలభాస్కర్, రామచంద్రమూర్తి, విజయ్పాల్గొన్నారు.