బడి బాట పట్టిన టీచర్లు
వైరల్ ఫీవర్, కరోనా కారణాలతో కొద్దిమంది ఆబ్సెంట్
మొదటి రోజు వర్క్ షీట్స్ ప్రిపరేషన్
పలుచోట్ల ఇబ్బందులు.. వర్క్ పై డైలమా
ప్రైమరీ హెల్త్ సపోర్ట్ అందించాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సర్కారు స్కూల్స్ రీఓపెన్ అవడంతో దాదాపు 6నెలల తర్వాత టీచర్స్ తిరిగి బడి బాట పట్టారు. సిటీలో 755 గవర్నమెంట్ స్కూల్స్ ఉండగా.. 4,400 మంది టీచర్లు పని చేస్తున్నారు. గురువారం నుంచి స్కూల్స్ రీ ఓపెన్ అవగా, సగానికి పైగా హాజరయ్యారు. మిగతా వాళ్లు వైరల్ ఫీవర్స్, కరోనా రిలేటెడ్ ఇష్యూస్ తో రాలేదు. చాలా స్కూళ్లలో శానిటైజేషన్ లేక, క్లీనింగ్ స్టాఫ్ రాక ఇబ్బందులు పడ్డారు. మొదటిరోజు తమ స్టూడెంట్స్ కి టీవీలు, స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయా అనే దానిపై సర్వే నిర్వహించారు. పిల్లల తల్లిదండ్రులకు ఫోన్ లో టైం టేబుల్స్ పంపినట్లు తెలిపారు. సెప్టెంబర్ 1 నుంచి డిజిటల్ క్లాసులు ఉండడంతో వీడియోల డిజైన్, వర్క్ షీట్స్ ప్రిపేర్ చేస్తున్నట్లు హెడ్ మాస్టర్స్ చెప్తున్నారు. స్కూల్స్ కి వెళ్తున్న టీచర్స్ కి ప్రైమరీ హెల్త్ సపోర్ట్ అందించాలని, వర్క్ షీట్స్ కోసం అన్ని స్కూల్స్ కి బడ్జెట్ మంజూరు చేయాలని
టీపీటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు.
అంతా గందరగోళం..
మొదటి రోజు ట్రాన్స్ పోర్ట్ ఫెసిలిటీ లేక స్కూల్ కి చేరుకోవడానికి పలువురు టీచర్లు ఇబ్బందులు పడ్డారు. వర్క్ షీట్స్ ఎలా రూపొందించాలనే దానిపై స్పష్టత కరువైందని వాపోయారు. ఒక్కో సబ్జెక్ట్ ప్రిపేర్ చేయడానికి 800 నుంచి 900 పేజీలు పట్టేట్టు ఉన్నాయంటున్నారు. టీవీలు లేని పిల్లల కోసం వాట్సాప్ లో యూట్యూబ్ లింక్ షేర్ చేసి, ఆ వివరాలను పేరెంట్స్ ఫోన్స్ కి మెసేజ్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి క్లాస్ టీచర్ తన సబ్జెక్ట్ కి సంబంధించిన రికార్డ్స్, పిల్లల సంఖ్య వంటివి చూసుకుంటూ షీట్స్ ప్రిపేర్ చేసేపనిలో పడ్డారు. వర్క్ షీట్స్ ప్రిపేర్ చేసేందుకు స్కూల్స్ లో సరిపడా కంప్యూటర్లు లేవని టీపీటీఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఎం.రవీందర్ తెలిపారు.
క్లాస్లపై అవేర్నెస్ కల్పిస్తున్నం
మా స్కూల్ పిల్లల్లో 30 –40శాతం మందికి టీవీ ల్లేవు. స్మార్ట్ ఫోన్స్ ఉన్నా సిగ్నల్ప్ ప్రాబ్లమ్ ఉంది.టీవీలు ఉన్నవారి ఇంటికి వెళ్లి క్లాస్లు వినాలని చెప్తున్నాం. క్లాసెస్ ఎలా జరుగుతాయనే దానిపై అవేర్నెస్ కల్పిస్తున్నాం.
– విజయలక్ష్మీ, హెచ్ఎం, ఫిలింనగర్
For More News..