
న్యూఢిల్లీ: అప్పులతో ఇబ్బందులు పడుతున్న వొడాఫోన్ ఐడియాకు ఊరట లభించింది. కంపెనీలో తన వాటాను 48.99 శాతానికి పెంచుకోవడానికి ప్రభుత్వం అంగీకరించింది. స్పెక్ట్రమ్ వేలం బకాయిలకు బదులుగా రూ. 36,950 కోట్ల విలువైన కొత్త షేర్లను కొనుగోలు చేయనుంది.
ప్రస్తుతం వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వానికి 22.6 శాతం వాటా ఉంది. అతిపెద్ద షేర్‌హోల్డర్‌గా కొనసాగుతోంది. ఈ కంపెనీ రూ. 10 ముఖ విలువ కలిగిన 3,695 కోట్ల ఈక్విటీ షేర్లను షేరు ధర రూ. 10 వద్ద 30 రోజుల్లో ప్రభుత్వానికి జారీ చేయనుంది. వొడాఫోన్ ఐడియా షేరు శుక్రవారం 2 శాతం పడి రూ.6.80 వద్ద ముగిసింది.