
హైదరాబాద్ : రైలు కిందపడి ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూ ర్ లో చోటుచేసుకుంది. మృతుడు హను మకొండ జిల్లా నడికూడ మండలం పులి గిల్ల గ్రామానికి చెందిన వాల్లాజీ కిరణ్ కుమార్ (45)గా స్థానికులు గుర్తించారు.
స్టేషన్ ఘన్ పూర్ లో రెంటుకు ఉంటూ..జఫర్గఢ్ మండలంలోని ఉప్పుగల్లు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ డ్యూటీ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం భార్య విడాకులు ఇవ్వడంతో తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.
►ALSO READ | లోన్ యాప్స్ వేధింపులకు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య..