
- కోట్లలో పెట్టుబడులు పెట్టించి మోసం
జన్నారం, వెలుగు: జన్నారం మండలంలోని కిష్టాపూర్ గవర్నమెంట్ హైస్కూల్లో టీచర్‌గా విధులు నిర్వహిస్తున్న జాడి మురళిని డీఈవో యాదయ్య సస్పెండ్ చేశారు. అధిక లాభాలు వస్తాయనే ఆశ చూపి తన్విత ఆయుర్వేదిక్ స్కీమ్‌లో టీచర్లతోపాటు ఇతరులను కూడా చేర్పించారు. వారి వద్ద నుంచి కోట్లలో పెట్టుబడులు పెట్టించాడు. అయితే ఎలాంటి లాభాలు ఇవ్వకపోగా.. ఇచ్చిన అసలు కూడా ఇవ్వకుండా మోసం చేశాడని మండలంలోని కలమడుగు గవర్నమెంట్ స్కూల్ టీచర్ జాడి నర్సయ్య జన్నారం పోలీస్ స్టేషన్లో గత 14న ఫిర్యాదు చేశారు.
తనతో సుమారు రూ.24 లక్షలు పెట్టుబడి పెట్టించి డబ్బులు ఇవ్వడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఈ నెల 24న విచారణ జరిపిన లక్సెట్టిపేట సీఐ అల్లం నరేందర్, జన్నారం ఎస్ఐ రాజవర్దన్ టీచర్జాడి మురళిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఈ నేపథ్యంలోనే కిష్టాపూర్ హైస్కూల్ హెచ్ఎం రాజన్న ఇచ్చిన నివేదిక ఆధారంగా మురళిని సస్పెండ్ చేసినట్లు డీఈవో తెలిపారు.