ఆశ్రమ పాఠశాలలను గురుకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలి: ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి 

భద్రాచలం, వెలుగు : ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక గిరిజన విద్యార్థులకు విద్యను అందిస్తున్న గిరిజన సంక్షేమ పాఠశాలలను గురుకులాలతో సమానంగా అభివృద్ధి చేయాలని, కన్వర్టెడ్​ ఆశ్రమ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. భద్రాచలంలో ఆదివారం యూటీఎఫ్​ ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉపాధ్యాయుల సదస్సు జరగ్గా ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు.

గిరిజన సంక్షేమశాఖకు ప్రత్యేక పరిరక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసి అర్హత కల్గిన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్​ చేశారు. ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. టీఎస్​యుటీఎఫ్​ రాష్ట్ర అధ్యక్షులు జంగయ్య మాట్లాడుతూ...పీఆర్​సీ కమిటీని నియమించాలని డిమాండ్​ చేశారు. గిరిజన విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు.